twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3 వివాహాలు, ప్రేమ పెటాకులు: హాట్ బ్యూటీ పశ్చాత్తం

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నీఫర్ లోపెజ్ జీవితంలో చేసిన తప్పులకు పశ్చాతాప పడుతోంది. ఇప్పటికి ఆమె మూడు వివాహాలు చేసుకుంది. మూడు వివాహాలు పెటాకులయ్యాయి. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ పెళ్లి కాకుండానే వీరి బంధం పెటాకులైంది. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా తప్పులు చేసానని....ప్రస్తుతం తన పిల్లలు తండ్రి లేని వారు కావడం బాధగా ఉందని, వారి జాగ్రత్తగా చూసుకుంటాను అంటోంది జెన్నిఫర్.

    తన భర్త మార్క్ ఆంటోనితో విడిపోయిన విషయం తెలిసిందే. వీరు విడిపోయిన దాదాపు మూడేళ్ల అనంతరం కోర్టు నుండి వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. వీరికి ఆరేళ్ల వయసున్న కవలలు ఉన్నారు. జెన్నిఫర్ లోపెజ్ సంరక్షణలోనే పిల్లలు ఉంటారు కాబట్టి నెలలో వారంరోజులు ఆంటోని పిల్లలతో గడిపే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

    Jennifer Lopez on Her Love Life: I've Made Mistakes

    కొన్ని రోజుల క్రితం జెన్నిఫర్ లోపెజ్ మాట్లాడుతూ.... తన భర్త మార్క్ ఆంథోని విడిపోవడమే జీవితంలో అత్యంత విషాదకర సంఘటన అని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ అన్నారు. 2012 లో మార్క్ ఆంథోని, లోపెజ్ లు విడిపోయారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆంథోని నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకోవడంపై ప్రస్తుతం లోపెజ్ విచారం వ్యక్తం చేయడం గమనార్హం.

    మార్క్ తో విడిపోయాక జీవితం దుర్భరంగా మారింది. ఎన్నడూ లేనంతగా జీవితంలో విషాదం నిండుకుందన్నారు. కొద్దికాలం పాటు ఆఘటన గురించి తలచుకుని బాధపడ్డాను. ప్రస్తుతం రియలైజ్ అవుతున్నాను. లోపెజ్ అన్నారు. కాగా.....ఆంటోని కంటే ముందే జెన్నిఫర్‌కు రెండు పెళ్లిళ్లు అయి విడాకులు అయ్యాయి. ఆంటోనీ ఆమె మూడో భర్త. అతని నుండి విడిపోయినప్పటి నుండి రెండేళ్లగా డాన్సర్ కాస్పర్ స్మార్ట్ తో లోపేజ్ డేటింగ్ చేసింది. ప్రస్తుతం అతను కూడా దూరం అయ్యాడు.

    English summary
    Jennifer Lopez opened up to Elle UK about making mistakes in the past with her ex-boyfriends and husbands, yet she still believes her true love exists: "The nirvana man, he's out there somewhere."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X