జెన్నిఫర్ లోపెజ్ సెక్స్ సినిమాకు బ్రేక్
ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ఇప్పుడు చాలా సంతోషంగా వుందట. ఇందుకు కారణం లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టు తీర్పు ఆమెకు అనుకూలంగా రావడమే. ఇంతకీ అసలు ఈ కోర్టు గోల ఏంటీ అనుకుంటున్నారా..!! అసలు విషయం ఏంటంటే ఈ పాప్ సింగర్ తన మొదటి భర్త ఒజాని నోయె తో పాటు హనీమూన్ కు వెళ్లినప్పుడు, వారు చాలా సన్నిహితంగా మెలిగిన దృశ్యాలను వీడియో తీసారట. ఇప్పుడా టేపులని ఆమె నుండీ విడిపోయిన ఒజాని నోయె పబ్లిక్ చెయ్యాలని, వాటిని అధిక మొత్తానికి విక్రయించాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేఖంగా జెన్నిఫర్ కోర్టులో కేసు దాఖలు చేసింది.
దీనిపై విచారణ జరిపిన కోర్టు నోయె, జెన్నిఫర్ లోపెజ్ ల మధ్య కుదిరిన వివాహ ఒప్పందంలో ఆమె వ్యక్తిగత విషయాలేవీ బయటపెట్టనని చెప్పిన దానికి విరుద్ధంగా అతను ప్రవర్తిస్తుండటాన్ని తప్పుబడుతూ ఈ సెక్స్ టేపులని పబ్లిక్ చెయ్యడానికి విరుద్ధంగా తీర్పు వెలువరించింది. కానీ నోయె మాత్రం దీని పై తాను న్యాయపోరాటానికి సిద్ధం అవుతానని ప్రకటించాడు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలోనే జెన్నిఫర్ కు నోయె $545,000 మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాడు.


Click it and Unblock the Notifications











