ఆ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు.. ఆడిషన్స్ సమయంలో వెకిలి చేష్టలు.. స్టార్ హీరోయిన్

క్యాస్టింగ్ కౌచ్‌.. ఈ రోజుల్లో ఈ విషయం గురించి తెలియని వారుండరు. క్యాస్టింగ్ కౌచ్‌ పేరుతో మహిళలు ఇస్తామని నమ్మించి లైంగికంగా వంచిస్తున్నారంటూ ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై ప్రముఖ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్‌ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి పోతే..

 కూడా క్యాస్టింగ్ కౌచ్‌ భాధితురాలినే అంటూ పాప్ స్టార్

కూడా క్యాస్టింగ్ కౌచ్‌ భాధితురాలినే అంటూ పాప్ స్టార్

ప్రముఖ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపేజ్‌ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ భాధితురాలినే అని ఓపెన్‌గా చెప్పేసింది. ఓ దర్శకుడు తనతో ప్రవర్తించిన తీరును చెబుతూ ఊహించని షాకిచ్చింది. ఇటీవలే హాలీవుడ్ నటులు స్కార్లెట్ జొహాన్సన్, రెనీ జెల్‌వెగర్, లుపీటా న్యోంగ్, లౌరా డెర్న్‌లతో కలిసి ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న జెన్నిఫర్ తనకు ఎదురైన ఘటన వివరించింది.

ఓ డైరెక్టర్ నన్ను పిలిచి షర్ట్ విప్పమన్నాడు

ఓ డైరెక్టర్ నన్ను పిలిచి షర్ట్ విప్పమన్నాడు

''ఓ సినిమా సందర్భంలో ఓ డైరెక్టర్ నన్ను పిలిచి షర్ట్ విప్పమన్నాడు. నా వక్షోజాలు చూస్తానన్నాడు. వెంటనే కుదరదు అని చెప్పేశాను. ఆ సమయంలో కాస్త భయం వెంటాడింది.. కానీ నాకు నేనే సపోర్ట్‌గా నిలిచాను. నాతో పాటు ఆ రూంలో కాస్ట్యూమ్ డిజైనర్‌ కూడా ఉంది. ఆ డైరెక్టర్‌ నాతో అసహ్యంగా ఏం మాట్లాడాడో అవన్నీ వింటూనే ఉంది'' అని చెప్పింది జెన్నిఫర్.

కావాలంటే అక్కడ చూపిస్తా అనేశాను

కావాలంటే అక్కడ చూపిస్తా అనేశాను

కావాలంటే సెట్‌లో నా వక్షోజాలు చూపిస్తాను కానీ ఇలాంటి ప్రదేశాల్లో కుదరదని చెప్పాను. ఎందుకంటే ఆ సమయంలో నేను నగ్న సన్నివేశాల్లో నటించాల్సి ఉంది కాబట్టి అని తెలిపింది జెన్నిఫర్. ఆ సమయంలో అతను అడిగాడు కదా అని నా షర్ట్ విప్పి చూపించి ఉంటే వారు ఏమైనా చేయగలరన్న ధీమాను పెంపొందించిన దాన్ని అయ్యేదాన్ని అని చెప్పుకొచ్చింది జెన్నిఫర్.

కాస్ట్యూమ్ డిజైనర్ నా వద్దకు వచ్చి ఇలా అనేసింది

కాస్ట్యూమ్ డిజైనర్ నా వద్దకు వచ్చి ఇలా అనేసింది

ఎప్పుడైతే గదిలో నుంచి ఆ డైరెక్టర్ బయటికి వెళ్లిపోయాడో అక్కడే ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ నా వద్దకు వచ్చి సారీ అలా జరిగి ఉండాల్సింది కాదు అని చెప్పిందని జెన్నిఫర్ పేర్కొంది. ఆ తర్వాత ఆ డైరెక్టర్ తనకు సారీ కూడా చెప్పాడని తెలిపింది జెన్నిఫర్. ఆ సమయంలో నాకు నేను ధైర్యం తెచ్చుకోకపోయి ఉంటే అతనిలో ఆ మార్పు వచ్చేది కాదని ఆమె పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X