twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికన్ ఐడియల్ లో జడ్జిగా మెరవనున్న ఆ అందగత్తే ఎవరు..?

    By Nageswara Rao
    |

    ఇటీవల ఇండియాలో ఇండియన్ ఐడియల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఇండియన్ ఐడియల్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిధిగా హాజరైన విషయం కూడా అందరికి తెలిసిందే. ఈ ఇండియన్ ఐడియల్ లో ఫైనల్స్ లో ముగ్గురు తలపడగా చివరకూ శ్రీరామ్ అనే తెలుగు కుర్రవాడు ఆ టైటిల్ ని సూపర్ స్టార్ అమితాబ్ చేతులమీదగా అందుకోవడం జరిగింది. ఈ ఇండియన్ ఐడియల్ కు మూలం అమెరికన్ ఐడియల్. అసలు అమెరికన్ ఐడియల్ ను చూసి ఇండియన్ ఐడియల్ ను పెట్టారనేది ముఖ్య సమాచారం. అలాంటి అమెరికన్ ఐడియల్ త్వరలో మరలా జరగబోతుంది. ఇలాంటి రియాలిటీ షో కార్యక్రమాలలో ముఖ్యంగా జడ్జిలను బట్టి షో అనేది ఉంటుంది.

    అంతకు ముందు అమెరికన్ ఐడియల్ కు సైమన్ కోవెల్ జడ్డిగా వ్యవహారించిన విషయం అందరికి తెలిసిందే. సైమన్ కోవెల్ ఈ షోని బాగా రక్తి కట్టించారు. మరలా సైమన్ కోవెల్ నే జడ్జిగా ఉండమని కోరగా ప్రస్తుతం ఆయనకు యుఎస్ షో లో బాగా ప్రాచుర్యం పోందిన ది xప్యాక్టర్ అనే షో ఉండడంతో ఈ షో నుంచి తప్పుకోవడం జరిగింది. దానితో ఈ షోను నిర్వహిస్తున్నటువంటి రైన్ సీక్రేస్ట్ కాస్త ఇబ్బందులలో పడ్డారు. దానితో ఈ అమెరికన్ ఐడియల్ ను నిర్వహించే బాధ్యతలను ఏరోస్మిత్ ఫ్రంట్ మ్యాన్ స్టీఫెన్ టేలర్ కు అప్పగించడం జరిగింది. మొన్నటి మొన్న ఆడిషన్లు నిర్వహించి షోను త్వరగా మొదలు పెట్టాలని స్టీఫెన్ టేలర్ కు చెప్పడం జరిగింది.

    ఈ ఆడిషన్స్ లో జెన్నిఫర్ లోపేజ్ మాజి భర్త ఒజాని నో కూడా పాల్గోన్నారు. అంతేకాకుండా తనతోపాటు మరోక జడ్జిని కూడా చూడమన్నారు. దానితో ఈ షో బాగా క్లిక్ చేయడం కోసం స్టీఫెన్ టేలర్ జెన్నిఫర్ లోపేజ్ ను ఆశ్రయించడం జరిగింది. దీనికి గాను జెన్నిఫర్ లోపేజ్ 12మిలియన్ డాలర్లును ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు. ప్రస్తుతం 10వ అమెరికన్ ఐడియల్ సిరిస్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని షోను నిర్వహిస్తున్నటువంటి రైన్ సీక్రేస్ట్ తెలిపారు. అంతేకాకుండా ఈ సింగింగ్ కాంపిటేషన్ జనవరి 2011లో యుఎస్ టెలివిజన్ లలో తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X