ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా జెన్నిఫర్ లోపెజ్
న్యూయార్క్: ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక బుధవారం విడుదల జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా మొదటి స్దానాన్ని జెన్నిఫర్ లోపెజ్ కైవసం చేసుకోగా.. రెండవ స్దానాన్ని అమెరికా టెలివిజన్ రాణి ఓప్రా విన్ఫ్రే సొంతం చేసుకుందని ప్రచురించింది. గతయేడాది ఇదే ఫోర్బ్స్ పత్రిక అత్యంత శక్తివంతమైన సెలబ్రటీగా లేడిగాగాని అభివర్ణించిన సంగతి తెలిసిందే.
గతయేడాది ఫోర్బ్స్ పత్రిక సినిమా, టివి, మ్యూజిక్, క్రీడా రంగాలకు సంబంధించి టాప్ 100 అత్యంత శక్తివంతమైన సెలబ్రటీల ర్యాంకింగ్స్ జెన్నిఫర్ లోపెజ్ 50వ స్దానాన్ని కైవసం చేసుకోగా.. ఈ ఏడాది జెన్నిఫర్ విడుదల చేసిన 'లెట్స్ గెట్ లౌడ్', 'లవ్ డోన్ట్ కాస్ట్ ఎ థింగ్' ఆల్బమ్‌లు ఒక్కసారిగా జెన్నిఫర్‌ని మొదటి స్దానంలో కూర్బోబెట్టాయి.
ఇక ప్రస్తుతం జెన్నిఫర్ లోపెజ్ అమెరికా టాలెంట్ షో 'అమెరికన్ ఐడల్' లో జడ్జి పాత్రను పోషించడంతో పాటు, ఆల్బమ్ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం, రాబోయే కాలంలో ప్రపంచ టూర్, మూడు సినిమాలలో నటించేందుకు గాను సంతకం చేయడం లాంటి అంశాలతో పాటు పేరు ప్రఖ్యాతులు, డబ్బు, హోదా ఆధారంగా జెన్నిఫర్ లోపెజ్ మొదటి స్దానాన్ని కైవసం చేసుకుందని ఫోర్బ్స్ పత్రిక ప్రతినిధులు తెలిపారు.
గత వేసవిలో తన భర్త మార్క్ ఆంటోనీ నుండి విడాకులు తీసుకున్న తర్వాత జెన్నిఫర్ లోపెజ్ సంపాదన గతయేడాదితో పోలిస్తే $25 మిలియన్ల నుండి ఒక్కసారిగా $52 మిలియన్లకు పెరిగిందని అంచనా. ఇక లేడిగాగా పోయిన సంవత్సరం మొదటి స్దానాన్ని కైవసం చేసుకోగా..ఈ ఏడాది 5వ స్దానంతో సరిపెట్టుకుంది. అందుకు కారణం ఈ ఏడాది లేడిగాగా ప్రపంచ టూర్స్ని నిర్వహించక పోవడమే. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ట్విట్టర్, ఫేస్ బుక్‌లో లేడిగాగా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటూ తన సత్తా చాటుతుంది.


Click it and Unblock the Notifications











