Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెక్సీ బ్యూటీ డిమాండ్: 40 నిమిషాలు డాన్స్‌కు 11 కోట్లు
మకావ్: హాలీవుడ్ నటి, అమెరికన్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి, ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లు(2500 కోట్లు). అయినప్పటికీ డబ్బు సంపాదించడానికి వచ్చి ఏ ఆఫర్ కూడా ఆమె వదులుకోవడం లేదు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా ఆమె క్రిస్ మస్ సందర్భంగా ఆమె మకావ్‌లో ఓ ప్రైవేట్ పార్టీలో 40 నిమిషాల పాటు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందుకు గాను ఆమె రూ. 1.75 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లపైనే) చార్జ్ చేసారు. 45 ఏళ్ల జెన్నిఫర్ లోపెజ్ ఇప్పటికీ తన సెక్సీ అందాలు, అదరగొట్ట పెర్పార్మెన్స్‌తో ఆకట్టుకుంటోంది.

ఆమెకు 40 నిమిషాల పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు 1.75 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తో పాటు అమెరికా నుండి మకావ్ వరకు ప్రత్యేక విమానం ఏర్పాట్లు గట్రా చేసారట. దీన్ని బట్టి ఆమెకు షోలకు ఉన్న ఫాలోయింగ్, డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
జెన్నిఫర్ లోపెజ్ గురించిన ఇతర విషయాల్లోకి వస్తే... ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు సైతం తీసుకున్న జెన్నిఫర్ ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ప్రియుడు కాస్పెర్ స్మార్ట్ తో ప్రేమాయణం నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ పెళ్లి కాకుండానే వీరి బంధం పెటాకులైంది. ప్రేమ, పెళ్లి విషయంలో చాలా తప్పులు చేసానని....ప్రస్తుతం తన పిల్లలు తండ్రి లేని వారు కావడం బాధగా ఉందని, వారి జాగ్రత్తగా చూసుకుంటాను అంటోంది జెన్నిఫర్.