బాయ్ ప్రెండ్ కొసం ఆన్‌లైన్ డేటింగ్ పోర్టల్‌ని సంప్రదించా..
యాక్టివిస్ట్ మరియు కమెడియన్ జెన్నీ మెక్ కార్తి తన బాయ్ ప్రెండ్ స్పోర్ట్స్ ఏజెంట్ 'పాల్ క్రిపాల్కా' నుండి విడిపోయిన తర్వాత కొత్త బాయ్ ప్రెండ్ కొసం వెతుకులాట ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో జెన్నీ మెక్ కార్తికి కొత్త బాయ్ ప్రెండ్ దొరకపొవడంతో ఆన్ లైన్ ద్వారా కొత్త బాయ్ ప్రెండ్‌ని చూచుకొని అతనితో డేటింగ్ చేసేందుకు సిద్దమైంది. అందుకు గాను, ఆన్‌లైన్ డేటింగ్ వెబ్ సైట్స్‌తో ఒప్పందం కుదుర్చుకొవడం జరిగింది.
39 సంవత్సరాలు వయసు కలిగిన జెన్నీ మెక్ కార్తి ఆన్ లైన్ డేటింగ్ వెబ్‌సైట్ 'మ్యాచ్.కామ్' లో తన ప్రొపైల్‌ని ఉంచడం జరిగింది. స్పోర్ట్స్ ఏజెంట్ 'పాల్ క్రిపాల్కా'తో తొమ్మిది నెలలు తిరిగి, రెండు నెలలు రొమాన్స్ చేసి ఫిబ్రవరిలో విడిపోయిన సంగతి తెలిసిందే. 'మ్యాచ్.కామ్' లో తన ప్రొపైల్‌ని పెట్టిన తర్వాత జెన్నీ మెక్ కార్తి మాట్లాడుతూ 35 నుండి 48 సంవత్సరాలు వయసు కలిగిన మగవారిని తాను కొరుకుంటున్నట్లు తెలిపింది.
నేను కొరుకొబోయే అతనికి పెద్ద నోరు ఉన్నా నేను పట్టించుకొను. అతనికి బట్టతల ఉన్నా నేను పెద్దగా విచారించను. నా అభిరుచులకు తగ్గట్టు ఉంటే చాలు. అతనికి ఉద్యోగం తప్పనిసరిగా ఉండాలి. నేను ఎప్పుడైనా ఆకలిగా ఉన్నానని చెబితే నాకొసం డిన్నర్, డ్రింక్స్ తెచ్చిపెట్టే విధంగా ఉండాలని తన మనసులోని మాటలను వెల్లడించారు. దీంతో జెన్నీ మెక్ కార్తి ని సొంతం చేసుకునేందుకు గాను 35 నుండి 48 మద్య వయసు గలవారు పొటీ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











