మా ఇద్దరి మధ్య దాపరికాలు లేకపోవడానికి కారణం మా నిజాయితి..
యాక్టివిస్ట్ మరియు కమెడియన్ జెన్నీ మెక్ కార్తి తన కొత్త బాయ్ ప్రెండ్ జాసన్ టోహేతో తన సంబంధం బాగా మెరగవడానికి వాళ్శిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా నిజాలు మాట్లాడుకోవడమేనని అంటున్నారు. ఇటీవల తాను రచిస్తున్నటువంటి కొత్త పుస్తకాన్ని సంబంధించి మయామి ఎపిక్ హొటల్ లో జెన్నీ మెక్ కార్తి మాట్లాడుతూ నాకు జాసన్ టోహే మధ్య ఉన్న బంధం విడదీయరానిది. మా మధ్య ఈ బంధం ఇంతలా ఏర్పడడానికి కారణం ఎప్పుడూ నిజాలు మరియు ఓపెన్ గా మాట్లాడుకోవడమే అని అన్నారు. ప్రస్తుతం తాను రచిస్తున్నటువంటి పుస్తకంలో ప్రేమ, సెక్స్ కి సంబంధించినటువంటి విషయాలు మరియు నిజమైన రోమాన్స్ ఎలా ఉంటుందో ఈ పుస్తకంలో వివరించునున్నామని ఆమె తెలిపారు.
ఈ సంధర్బంగా జెన్నీ మెక్ కార్తి మాట్లాడుతూ తనకు నచ్చినటువంటి విషయాల్లో నేను అసలు మాట్లాడను. అంతేకాకుండా తనకి చైనీస్ పుడ్ అంటే బాగా ఇష్టం. కాని నాకు అదంటే అసలు ఇష్టం ఉండదు. అలాంటి సమయాలలో నేను తనని తినోద్దని వారించను. నాకోసం తన అభిప్రాయాలను మార్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. తీరిక సమయాలలో మేమిద్దరం ఇంట్లో పోకర్ గేమ్ ఆడుకుంటుంటాము. మా రిలేషన్ షప్ చాలా గట్టిది దానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న నిజాయితి. అయిదు సంవత్సరాలు కలిసి ఉన్న నేను జిమ్ కోన్నికారణాల విడిపోవడం జరిగింది. అదే సమయంలో నాకు ఈ బుక్ ఆఫర్ రావడం జరిగింది. ఈ పుస్తకం రాస్తున్న సమయంలో నాగురించి నేను చాలా తెలుసుకున్నాను. అనవసరంగా ఇతరులపై నిందనలు మోపకూడదని అనుకున్నాను.


Click it and Unblock the Notifications











