టామ్ క్రూయిజ్ తో జెరిమి రెన్నర్......!
టామ్ క్రూయిజ్ ఇతని పేరు యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు. టామ్ క్రూయిజ్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. టామ్ క్రూయిజ్ అంటే మనకు మొట్టమొదట గుర్తుకు వచ్చేది ఆయన నటించిన మిషన్ ఇంపాజిబుల్ సిరిస్. టామ్ క్రూయిజ్ ఎంత బాగా యాక్టింగ్ చేస్తారో అంత అందంగా వుంటారు. ఈయన నటించిన మిషన్ ఇంపాజిబుల్-3 యావత్ ప్రపంచం మొత్తం బాక్సాఫీస్ రికార్డులను వసూలుచేసింది.
మిషన్ ఇంపాజిబుల్-3 ని 2006 లో విడుదల చేయడం జరిగినది. ఈ సినిమా దర్శకుడు జె.జె.అబ్రామ్స్ కి ఇది తోలిసినిమా. అలాంటి ఈ మిషన్ ఇంపాజిబుల్ సిరిస్ కు కోత్తగా ఇంకోక సిరిస్ ను మిషన్ ఇంపాజిబుల్-4 ని తీయడానికి రంగం సిధ్దం చేశారు. ఈ సినిమాతో హాలివుడ్ మొత్తం అతని పేరు మారుమోగిపోయింది. అలా మిషన్ ఇంపాజిబుల్-4 లో టామ్ క్రూయిజ్ ప్రక్కన సపోర్టింగ్ రోల్ కి వేరే హీరో అవసరం వచ్చింది.
పారామౌంట్ పిక్చర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ కోసం చాలా మందికి స్కీన్ టెస్ట్ నిర్వహించడం జరిగినదని, చిత్రదర్శకుడు జె.జె.అబ్రామ్స్ మాట్లాడుతూ ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం హార్ట్ లాకర్ సినిమా హారో జెరిమి రెన్నర్ ని తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. జెరిమి రెన్నర్ నటనను తాను హార్ట్ లాకర్ సినిమాలో చూశానని, టామ్ క్రూయిజ్ ప్రక్కన తను ఐతే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ సినిమా షూటింగు యు.యస్, వాంకోవర్, దుబాయ్ లలో చిత్రీకరిస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











