మైఖేల్ మరణించినందుకు నాకేం బాధలేదు...!!
ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ సంవత్సరం జూన్ 25వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చెందడం పట్ల తనకు పెద్దగా బాధగా ఏమీ అనిపించలేదని అతని సోదరుడు, పాప్ సింగర్ జర్మెయిన్ జాక్సన్ అభిప్రాయపడ్డాడు. మైఖేల్ ను బ్రతికించడానికి అసలు ఏ దారీ లేకపోయినప్పుడు ఇక బాధపడి ఏం లాభం అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
మైఖేల్ ఎంతో ఖరీదైన, ప్రమాదకరమయిన డ్రగ్స్ వాడుతూ, తన జీవితంతో ఆడుకుంటున్నాడని తెలిసి తమ కుటుంబ సభ్యలమంతా తనకి బాసటగా నిలవడానికి ముందుకొచ్చామని కానీ అప్పటికే జాక్సన్ ఆ డ్రగ్స్ కు బాగా అలవాటు పడిపోయాడని, తమ చెయ్యిదాటి పోయాడని తెలిసిందని తెలిపాడు. ఆ తర్వాత కూడా ఎంతో పవర్ ఫుల్ డ్రగ్స్ వాడినప్పటికీ అతన్ని కాపాడలేమని తెలిసిందని చెప్పాడు.
మరి అలాంటప్పుడు తన సోదరుడు బ్రతకడని తెలిసినప్పుడు, ఇక గిల్టీగా ఫీలవ్వడం ఎందుకని ఆయన అభిప్రాయపడ్డాడు. మితిమీరిన డ్రగ్స్ తో మైఖేల్ తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడని అభిప్రాయపడ్డాడు. కాగా మైఖేల్ సోదరులంతా కలసి ప్రపంచ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











