ఛీఛీ అతన్ని అస్సలు ఒప్పుకోను అంటున్న నటీమణి
ప్రముఖ హాలీవుడ్ నటి ఆస్కార్ అవార్డు పొందిన సాంద్రా బుల్లక్ తన భర్త జెస్సీ జేమ్స్ ను క్షమించడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. కనీసం అతనితో మాట్లాడటానికి కూడా ఆమె సిద్దంగా లేదు. సాంద్రా తనకు ఆస్కార్ తెచ్చిపెట్టిని సినిమా ది బ్లైండ్ సైడ్ సినిమా షూటింగ్ లో బిజీగా వుండగా ఇక్కడ ఈయన రాసలీలల్లో మునిగితేలాడు. ఏకంగా ముగ్గురు యువతులతో కులికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతో ఈ ఆస్కార్ అవార్డు నటీమణి అతన్ని వదిలి హాలీవుడ్ కొండల్లోని తన ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఇతగాడు ఎలాగయినా సాంద్రా బుల్లక్ ను తిరిగి తనదానిని చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట.
ఆమెకు తను మారిపోయానని తెలపడానికి మానసికచికిత్సా కేంద్రానికి వెళ్లినట్టు నటించిన అతను ఆమె అతని కాల్స్ రిసీవ్ చేసుకోకపోవడంతో అక్కడి నుండీ బయటకు వచ్చేసి తిరిగి ఏ పథకంతో ఆమెను బుట్టలో పడేయాలా అని ఆలోచిస్తున్నాడట. కానీ సాంద్రా మాత్రం అతన్ని తిరిగి తన భర్తగా ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని విడాకులకు సమాయత్తం అవుతోందట.


Click it and Unblock the Notifications











