శ్వేత సౌధంలో పుట్టినరోజు అంగరంగ వైభవంగా..
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా ఆల్బా తన 31వ పుట్టిన రోజుని అమెరికా శ్వేత సౌధంలో జరుపుకోనున్నట్లు సమాచారం. ఇంతకీ జెస్సికా ఆల్బా పుట్టిన రోజు ఎప్పుడని అనుకుంటున్నారా..? ఏప్రిల్ 28. జెస్సికా ఆల్బా తన భర్త క్యాష్ వార్రెన్‌తో కలసి ఈ పార్టీని జరుపుకోనుంది. క్యాష్ వార్రెన్‌తో జెస్సికా ఆల్బా ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది. వారి పేర్లు వరుసగా హానర్, హెవెన్.
జెస్సికా ఆల్బా తన భర్తతో కలసి ఏప్రిల్ 28వ తారీఖున శ్వేత సౌధంలోకి వార్షిక ప్రతినిధులు డిన్నర్‌కి వెళ్లనుంది. ఈ వార్షిక ప్రతినిధులు డిన్నర్‌కి జెస్సికా ఆల్బా భర్త క్యాష్ వార్రెన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే రోజు జెస్సికా ఆల్బా పుట్టినరోజు కలసి రావడంతో తన పుట్టినరోజుని శ్వేత సౌధంలో జరుపుకోనున్నట్లు అందరికి డప్పు వేసి మరీ చెబుతుంది.
ఆల్బా ఇటీవల ఓ ఇంటర్యూలో ఏప్రిల్ 28న నేను వాషింగ్టన్ డిసి వెళుతున్నాను. ఆరోజు శ్వేత సౌధంలో వార్షిక ప్రతినిధులు డిన్నర్ ఉంది. ఆ డిన్నర్‌తో పాటు నా పుట్టిన రోజుని అక్కడే జరుపుకుంటానని తెలియజేశారు. జెస్సికా ఆల్బా తన పిల్లలను హాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టులుగా ఎట్టి పరిస్దితులలోను ఇండస్ట్రీగా పరిచయం చేయించనని అంటున్నారు. అందుకు కారణం ఏంటని ప్రశ్నించగా జెస్సికా ఆల్బా సమాధానంగా నేను కూడా నాజీవితంలో 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు హాలీవుడ్ సినిమాలలో నన్ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'క్యాంప్ నవ్ ఇయర్' అనే సినిమాలో తెరకు పరిచయం చేశారు. ఆ వయసులో నేను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం వల్ల నా జీవితంలో చిన్ననాటి మధుర జ్ఞాపకాలను కొల్పోయాను.
అందుకే ఇప్పుడు అలా నా పిల్లలకు జరగకూడదని అంటున్నానని అన్నారు. జెస్సికా ఆల్బా మాట్లాడుతూ నా పిల్లలను నాలాగే కావాలని మాత్రం నేను ఆశించడం లేదు. ప్రస్తుతం నాకు మూడు సంవత్సరాల వయసు కలిగిన పాప ఉంది. పాప పేరు మారియా. త్వరలో మరో పాపకు జన్మనివ్వడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. తన జీవితం గురించి తనకు అప్పుడే ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే నాపిల్లలను వారియొక్క కాలేజీ డేస్ పూర్తి అయ్యేవరకు సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడొద్దని అంటున్నారు.


Click it and Unblock the Notifications











