హాన్సత్ ఖాన్, డయానాకి మద్య ఉన్న సంబంధమే సినిమా
'ప్రిన్సెస్ డయానా' పాత్ర అంటే రాయల్ లుక్‌గా ఉండాలి. అందుకే కాబోలు చివరకు వెతికి వెతికి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'జెస్సికా చస్టెయిన్'ని ఈ పాత్ర కొసం సెలక్ట్ చేశారు. హాలీవుడ్‌లో త్వరలో విడుదల కానున్న 'కాట్ ఇన్ ఫైట్' అనే సినిమాలో ప్రిన్సెస్ డయానా పాత్రని చేసేందుకు గాను 'జెస్సికా చస్టెయిన్' సంతకం చేశారని సమాచారం.
వివరాల ప్రకారం 'జెస్సికా చస్టెయిన్' ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయనున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం జెర్మన్ దర్శకుడు హిర్స్చ్బిఎగెల్ వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ని 2012 మార్చిలో ప్రారంభించనున్నారు. ఈ సినిమా కొసం ఇప్పటికే దర్శకుడు పాకిస్దాన్, అంగోలా, దక్షణ ప్రాన్స్, పారిస్ తదితర షూటింగ్ లోకేషన్స్‌ని ఎంచుకొవడం జరిగింది.
ఈ సినిమా ముఖ్యంగా డాక్టర్ హాన్సత్ ఖాన్, ప్రిన్సెస్ డయానాకు మద్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టే విధంగా ఉంటుందని సమాచారం. 2008వ సంవత్సరంలో డాక్టర్ హన్సత్ ఖాన్, ప్రిన్సెస్ డయానాకి మద్య ఉన్న రొమాంటిక్ సీక్రెట్‌ని టెలిగ్రాఫ్‌కి వివరించిన సంగితి తెలిసిందే. దాని ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. 'కాట్ ఇన్ ఫైట్' సినిమాకు కధ, మాటలను లిబెర్టైన్ స్టీవెన్ జెప్రీ రచించారు.


Click it and Unblock the Notifications











