పెళ్లి ఓకె.. 'వెడ్డింగ్ వెన్యూ' నే సమస్య
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెస్సికా బీల్, గాయకుడు జస్టిన్ టింబర్లేక్ ఇద్దరూ ఆగస్టులో పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నప్పటికీ వీరికి సరైన వెడ్డింగ్ లోకేషన్ మాత్రం ఇంకా దొరకలేదు. వీరికి పెళ్లికి వచ్చే గెస్టులకు ఆతిథ్యం ఇచ్చేందుకు గాను సరైన పెళ్లి స్దలం ఎక్కడైతే బాగుంటుందో నిర్ణయించుకోలేదు. ఐతే ఓ ప్రముఖ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం ప్రకారం కాలిఫోర్నియా ఐతే బాగుంటుందని అనుకున్నట్లు సమాచారం.
సింగర్‌గా ఉన్న రోజుల్లో తన కోస్టార్ హీరో అయిన జస్టిన్ టింబర్‌లేక్‌తో కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు. ఏవో కొన్నిమనస్పర్దలు రావడంతో ఇద్దరూ ఈ సంవత్సరం మొదట్లో విడిపోడం తిరిగి మరలా కెనాడాలోని టోరెంటోలో ఉన్న ఎల్లాస్ కాఫీ షాప్‌లో ఇద్దరూ కలసి కాఫీ త్రాగుతూ రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తూ దొరికిపోయారు.
వీరిద్దరి అక్కడ చూసిన అభిమానులు తెలిపిన దానిప్రకారం ఇద్దరూ కూడా మొదట్లో ఎలా ఐతే కలసి మెలసి ఉండే వారో అదే విధంగా వారియొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ కనిపించారని సమాచారం. చాలా రోజులు తర్వాత కలుసుకున్న వీరిద్దరిలో జస్టిన్ టింబర్‌లేక్, జెస్సికా బియిల్‌ను చూస్తూ అలానే ఉండిపోవడం జరిగిందంట. అంతేకాకుండా జస్టిన్ జెస్సికాతో మాట్లాడుతూ జీవితాంతం నీ ముఖంలో ఇలాంటి ఆనందాన్ని చూడాలని అనుకుంటున్నానని వెల్లడించాడంట. దీంతో వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











