అతనితో ఉన్నంతసేపు నాకు అసలు టైమ్ తెలియడంలేదు..
ఆడది తిరిగి చెడ్డది మగాడు తిరగక చెడిపోయాడు అనే తెలుగు సామెత మన హాలీవుడ్ అందాలరాశి, అమెరికన్ సింగర్ జెస్సికా సింప్సన్ కుబాగా సెట్ అవుతుంది. దానికి కారణం ఎంతమందితోనో చెడు సావాసాలు చేసి, తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా తనకి ఇంకా బుధ్ది రాలేదు. మరో తోడుకోసం చూస్తుంది. ఇలాంటి సమయంలో ఈ అందగత్తె మత్తులో పడ్డాడు పుట్ బాల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్. మే నుంచి ఈ యన్ యఫ్ యల్ స్టార్ ప్లేయర్ తో ఈమె డేటింగ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన జెస్సికా సింప్సన్ మాత్రం మేమిద్దరం మంచి స్నేహితులం, జాన్సన్ అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం కలసి గడపడానికి ఇష్టపడుతున్నామని, తనతో ఉన్నంతసేపు నాకు అసలు టైమ్ తెలియడంలేదని అన్నారు.
అంతేకాకుండా రేపు మాకు లాంగ్ డే. రోజు మొత్తాన్ని మేము ఆస్వాదించాలని అనుకుంటున్నామన్నారు. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టమని, ఇద్దరం కలసి ఆర్ట్ గ్యాలరీస్ కివెళ్శాలని నిర్ణయించుకున్నామన్నారు. పోటోగ్రఫీ కూడా చాలా ఇష్టం. ఈ రిలేషన్ షిప్ ఇలాగే కోనసాగాలని, ప్రస్తుతానికి నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతానికి నాజీవితంలో ఇంకెవరిని ఊహించుకోవడం లేదన్నారు. ఇప్పుడిప్పుడే గత జీవితం గురించి మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. చివరవరకు కూడా నా జీవితాన్ని ఎరిక్ జాన్సన్ తోనే గడపాని అనుకుంటున్నానన్నారు.


Click it and Unblock the Notifications











