జనవరి 26న 'మగధీరుడు' గా జెట్ లీ..
ఇండో ఓవర్సీస్ ఫిలింస్ సమర్ఫణలో హాలీవుడ్ యాక్షన్ హీరో జెట్ లీ హీరోగా ఇంగ్లీషులో రూపొందిన 'ఎ వైట్ స్నేక్స్ రివెంజ్' చిత్రాన్ని సత్యా ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులో 'మగధీరుడు' అనే పేరుతో జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిధ్ద నిర్మాత కోరుకొండ వరహాలరావు ఈ ఇంగ్లీషు చిత్రాన్ని తెలుగులోకి అనువదించి మగధీరుడు అనే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా సినిమా నిర్మాత కోరుకొండ వరహాలరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న యాక్షన్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సొంతం చేసుకున్న జెట్ లీ గతంలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో తన ఫైట్స్‌తో అందరిని ఆక్టటుకున్నాడు. మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరింపజేసేందుకు మగధీరుడుగా రానున్నాడు. జెట్ లీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ని బట్టి ఈ సినిమాని జనవరి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హిందీలో 'జెట్లీ అవర్ అనకొండ'గా, తమిళంలో బోధధర్మ గా ఈ చిత్రం విడుదలవుతుంది. తెలుగులో మాత్రం మగధీరుడుగా జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా మా సత్యా ప్రొడక్షన్స్ బ్యానర్ విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రాజ శ్రీ సుధాకర్, నిర్మాత: కోరుకొండ వరహాలరావు, కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం: టోనీ చింగ్.


Click it and Unblock the Notifications











