ముద్దు పెట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవరైనా అనిఅంటున్న కమెడియన్..
ముద్దు పెట్టకోవడం కూడా ఓకళ అన్నారు వెనుకటికి ఓపెద్దాయన. హాలీవుడ్ లోహాస్యం చేయాలంటే ఆయన తర్వాతే అంటారు అందరూ. ఆయన ఎవరోకాదు జిమ్ క్యారీ. హాలీవుడ్ లోకామెడీ రోల్స్ చేయాలంటే జిమ్ క్యారీ తర్వాతే అన్నంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. తన నటనకు గాను ఎన్నో సార్లు హాలీవుడ్ లోప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సోంతం చేసుకున్నారు. అంతేకాకుండా జిమ్ క్యారీ పోషించేటటువంటి పాత్రలు ఎంతో వైవిధ్యంతో కూడుకోని ఉంటాయి. త్వరలో విడుదల కోబోతున్న 'ఐలవ్ యూ ఫిలిప్ మోరిస్' లోతన నటన ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
ఈసినిమాలో జిమ్ క్యారీతో పాటుగా లీడ్ రోల్ లోఇవాన్ మెక్ గ్రెగర్ నటించారు. ఈసందర్బంగా జిమ్ క్యారీ మాట్లాడుతూ ఈఅబ్బాయిని చూడండి. నాకు తెలిసి ఇతను ఓ గ్రేట్ కిస్సర్ అంటూ అభివర్ణించారు. ఈవిషయం నాకు ఎలా తెలిసిందంటే ఈసినిమాలో నాకు, ఇవాన్ మెక్ గ్రెగర్ మద్య కోన్ని ముద్దు సీన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈసినిమాలో నాతోటి వ్యక్తి అయినటుంటి ఇవాన్ మెక్ గ్రెగర్ తోనేను ప్రేమలో పడడం జరుగుతుంది. ఏంటీ అబ్బాయితో అబ్బాయి ప్రేమలో పడడం ఏంటా అనుకుంటున్నారా..అదేనండీ ఈసినిమా సస్పెన్స్ అని అన్నారు. ఎదుటివారితో ప్రేమను పంచడానికి అతను అబ్బాయి లేక అమ్మాయా అని ఆలోచించవల్సిన పనిలేదు. ప్రేమ అనేది అబ్బాయి, అబ్బాయి మద్య కూడా ఉండవచ్చునని అన్నారు. ఇదేం ప్రేమరా బాబు మన దేశంలో మాత్రం ఇంకా ఇలాంటి ప్రేమలు ఇంకా పుట్టలేదు అందుకు మనం సంతోషించాలి....


Click it and Unblock the Notifications











