నేను ముసలిదాన్ని అయినా ఇలాగే వుంటాను..!!
దశాబ్ద కాలంపైగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో గుబులు రేపుతున్న పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ తాను 71 ఏళ్లు వచ్చే వరకూ కూడా గ్లామర్ ఫీల్డ్ ను వదిలి వెళ్లనని చెప్పుకొచ్చింది. ఇటీవల మీడియాతో మాట్లాడూ ఆమె ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇప్పటికీ ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటని అడుగగా తన నేత్రాలు, శిరోజాలు, ముఖం, శరీరానికి సరైన మేళవింపుతో తాను ఇస్తున్న బ్యూటీ ట్రీట్‌మెంటే తన సౌందర్య రహస్యం అంటూ సెలవిచ్చిందీ సుందరాంగి.
పదేళ్లకు ముందూ, ఇప్పుడు సైతం తన సుందరరూపం చెక్కు చెదరకుండా స్థిరంగా ఉండడానికి కారణం తాను విపరీతంగా స్నానాన్ని ఇష్టపడటమే అని అంటుంది జెలో. విలక్షణమైన తైలాలతో విస్తృతంగా స్నానం చేస్తూ పోవడమే తన సౌందర్య రహస్యం అంటుందీమె. "స్నానానికి చాలా సమయం కేటాయిస్తుంటాను. ఒత్తిడినుంచి బయటపడాలంటే ఏకైక మార్గం అదొక్కటే మరి. జో మెలోన్ బాత్ ఆయిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ద్రాక్ష, నిమ్మ, మాండరిన్, ఎర్రగులాబీలు నా ఫేవరైట్లు" అంటుందీ మెరుపు కళ్ల చిన్నది. తాను 71 ఏళ్లు వచ్చినా ఇలాగే వుంటానని, గ్లామర్ ప్రపంచాన్ని విడిచేది లేదని ఆమె స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications











