దారుణం: అభిమానుల ముందే ప్రముఖ సింగర్ సజీవ దహనం
స్పెయిన్లో ఊహించని దారుణం జరిగింది. ప్రముఖ స్పానిష్ గాయని జోయానా సెయిన్స్ గార్సియా సంగీత కచేరి జరుగుతుండగా వందలాది మంది అభిమానుల ముందే సజీవ దహనం అయింది. వేడుకలో భాగంగా అక్కడ పైరో టెక్నిక్ స్టంట్ నిర్వహించగా ప్రమాదవశాత్తు బాణాసంచా పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
30 ఏళ్ల జోయానా సెయిన్స్ వేదికపై ప్రదర్శన ఇస్తుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు ఝామున 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మాడ్రిడ్ సమీపంలోని ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు, అయితే సంగర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

వేదిక పైకి దూసుకెళ్లిన రాకెట్
ఆకాశంలో వివిధ రకాల డిజైన్స్‌తో మెరుపులు వెదజల్లే భారీ బాణా సంచా కాలుస్తుండగా అందులో నుంచి ఒక రాకెట్ వేదిక పైకి దూసుకెళ్లి జోయానాకు తాకి పేలింది. దీంతో ఆమెకు మంటలు అంటుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో అంతా షాకయ్యారు. షో నిలిచిపోయింది.

చివరి రోజు ప్రదర్శనజరుగుతుండగా..
అవిలా ప్రావిన్స్, లాస్ బెర్లానాస్లో సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రాతో కలిసి నాలుగు రోజుల మ్యూజిక్ కాన్సెర్టులో భాగంగా చివరి రోజు సెయిన్స్ ప్రదర్శన ఇస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. ఈ సంఘటన జరిగినప్పుడు సుమారు 1,000 మంది ప్రదర్శన చూస్తున్నారు.

జోయానా మెయిన్ సింగర్, డాన్సర్
స్పానిష్ వార్తాపత్రిక కథనం ప్రకారం, సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా ప్రమోటర్ ప్రోన్స్ 1ఎస్ఎల్ ఈ సంఘటనను దురదృష్టకరం అని వ్యాఖ్యానించింది. బాణా సంచా తయారీలో లోపం వల్లే ఈ ప్రభావం సంభవించినట్లు భావిస్తున్నారు. జోయానా సెయిన్స్ సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా ప్రధాన సిగర్, డాన్సర్.

గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదు
గడిచిన ఐదారు సంవత్సరాలలో 2000 కంటే ఎక్కువ ప్రదర్శనలు తమ ఏజెన్సీ నిర్వహించిందని, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా కాలేదని సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా ప్రమోటర్ ప్రోన్స్ 1ఎస్ఎల్ ప్రతినిధి ఇసిడ్రో లోపెజ్ అన్నారు.


Click it and Unblock the Notifications











