'సెక్సీయస్ట్ ఉమెన్' టైటిల్ ఏ మాత్రం ఇష్టం లేదు
లండన్, జూన్ 15: ఇటీవల ప్రముఖ మెన్స్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ సర్వేలో 'ది సెక్సీయస్ట్ ఉమెన్ ఎలైవ్(సజీవంగా ఉన్న ఆకర్షణీయ మహిళ )' టైటిల్‌ను సొంతం చేసుకున్న స్కేర్‌లెట్ జాన్సన్ మాట్లాడుతూ ది సెక్సీయస్ట్ ఉమెన్ ఎలైవ్ తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. 27 సంవత్సరాల వయసు కలిగిన స్కేర్‌లెట్ జాన్సన్ చూసేందుకు అందంగా, సెక్సీ ఉండడమే వల్లనే ఆమె అభిమానులు ఈ టైటిల్‌కు ఎంపిక చేశారని మ్యాగజైన్ నిర్వాహాకులు తెలియజేశారు.
ప్రపంచంలో నాకంటే ఎంతో మంచి అందమైన ఆడవారు ఉన్నారు. వారు హీరోయిన్స్ కాకపోయినప్పటికీ చాలా అందంగా ఉంటారు. నా వరకైతే ది సెక్సీయస్ట్ ఉమెన్ ఎలైవ్ టైటిల్ ఇవ్వడం అస్సలు నచ్చలేదని అన్నారు. ఒక ఒక నటిగా నేను, అనామధేయత చూపించడానికే ఇష్టపడతానని అన్నారు. గతయేడాది ఓ హ్యాకర్ స్కేర్‌లెట్ జాన్సన్ మొబైల్ ఫోన్ నుండి నగ్నంగా ఉన్న ఫోటోలను దొంగిలించి ఆన్ లైన్‌లో లీక్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో స్కేర్‌లెట్ జాన్సన్ ఎప్పుడైనా బయటకు డిన్నర్‌కు వెళదామని ఆలోచించినప్పుడు.. బయటకు వెళ్లలేక పోతున్నాను. ఎందుకంటే పబ్లిక్ అంతా నా నగ్న చిత్రాలను చూడడంతో ఎవ్వరిని కలిసేందుకు వెళ్లినా అందరూ నన్ను అదోలా చూస్తున్నారని జంకుతూ తెలిపింది. ఆన్ లైన్‌లో సంచరిస్తున్న స్కేర్ లెట్ జాన్సన్ ఫోటోలలో ఒకటి జాన్సన్ టాప్ లెస్‌గా బెడ్ పై పడుకోని ఉంది.
ఇటీవల కాలంలో స్కేర్ లెట్ జాన్సన్ ఇమేజిని ఉపయోగించి స్పానిష్‌కు చెందిన 'విఐపి' సెక్స్ స్టోర్ బిజినెస్ కార్డులు రూపొందించారు. ఈ విషయం ఓ ప్రముఖ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకున్న స్కేర్ లెట్ జాన్సన్ ఈ క్రింది విధంగా స్పందించారు. 'విఐపి' సెక్స్ స్టోర్ బిజినెస్ కార్డుల నిమిత్తం నా ఇమేజిని అనధికారకంగా నా పరిమిషన్ లేకుండా ఉపయోగించుకున్న విషయం నాకు తెలియజేసినందుకు టిఎమ్‌జడ్ వెబ్‌సైట్‌ని అభినందిస్తున్నాను.
ఒక్కమాటలో చెప్పాలంటే నా మెక్సికన్ అభిమానుల పరిజ్ఞానం సురక్షితమైన దాని కోసం ఉపయోగించినప్పటికీ పరిశోధనాత్మక జర్నలిజం చేశారని అన్నారు. స్కేర్ లెట్ జాన్సన్, రేయన్ రేనాల్డ్స్ మూడు సంవత్సరాల పాటు కలసి జీవించిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇటీవలే జులైలో విడాకులు తీసుకున్నారు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications











