Don't Miss!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అందాల రాశి మాజీ భర్త మ్యుజీషియన్ కళ్శు ఇప్పుడు బికిని భామ పై ..!
జెన్నిఫర్ అనిస్టాన్ మాజీ భర్త మ్యుజీషియన్ జాన్ మేయర్ మొన్నటి వరకు అనిస్టాన్ ను తిరిగి తన జీవితం లోకి ఆహ్వానించాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. జాన్ అనిస్టాన్ కు ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్ తో తిరిగి తనతో జీవించాలని అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ 31 ఏళ్ల మ్యుజీషియన్, 40 ఏళ్ల అనిస్టాన్ ను తిరిగి తనతో వుండమని బ్రతిమలాడుతున్నట్టు వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని జాన్ మేయర్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో జాన్ మేయర్ కళ్శు హాలీవుడ్ సెక్స్ బాంబ్, బికిని భామ కిమ్ కర్దాషియాన్ మీద పడ్డాయని గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఓ నైట్ పార్టీలో కిమ్ కర్దాషియన్ మరియు జాన్ మేయర్ కలుసుకోవడం జరిగింది. దానితోపాటు తాను నటిస్తున్నటువంటి కొత్త సిరిస్ కోసం జాన్ మేయర్ మరియు కిమ్ కర్దాషియన్ ఇద్దరూ వారి స్నేహితులతో కలసి రావడం జరిగింది. ఆసమయంలో కిమ్ కర్దాషియన్ జాన్ మేయర్ తో మాట్లాడుతూ ప్రస్తుతం న్యూయార్క్ లో నేనోక మగాడి కోసం అన్వేషణ సాగిస్తున్నానని అన్నారు. ఇక అంతే మేయర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానికి కారణం మన జాన్ మేయర్ కూడా సింగిల్ గా ఉండడం మాత్రమే కాకుండా కిమ్ కర్దాషియన్ కూడా జాన్ మేయర్ కి బాగా నచ్చిందంట. దానితో తన ట్విట్టర్ లో కిమ్ కర్దాషియన్ గురించి చాలా అందంగా ట్విట్ చేశాడంట.
దీనిని బట్టి జాన్ మేయర్ అభిమానులు మరలా మనవాడు ప్రేమలో పడ్డాడని అనుకుంటున్నారు. కిమ్ కర్దాషియన్ కూడా సింగిల్ గాఉండడం జాన్ మేయర్ కుకలసి వచ్చే విషయం. ప్రస్తుతానికి జాన్ మేయర్ కూడా గోరింక లాగా చిలక కోసం చూస్తుండడం, చిలకే గోరింక దగ్గరకి వచ్చి నాకు సేద తీర్చే గోరింక కావాలని అడగడంతో వీరి సమస్య తీరింది. ఇక ఇద్దరూ చక్కగా ఒక ఇంటివారై ఆడుతూ పాడుతూ ఉండాలని కోరుకుందాం.