ఎంజలీనా, జానీ డెప్ ల మధ్య హాట్ హాట్ గా....!!
హాలీవుడ్ తార, సెక్సీయెస్ట్ ఉమన్ గా ఎన్నికయిన ఏంజలీనా జోలీ తాజాగా 'ది సాల్ట్', 'ది టూరిస్ట్' అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'ది సాల్ట్' సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవ్వడానికి సిద్ధంగా వుంది. కాగా 'ది టూరిస్ట్' సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో ఆమె సెక్సీయెస్ట్ మ్యాన్ గా రెండు సార్లు ఎన్నికయిన జానీ డెప్ లో కలసి నటిస్తోంది. కాగా ఈ సినిమాలో వీరిద్దరి మధ్య గరం గరం సీన్లు ఉంటాయని విశ్వసనీయ సమాచారం. షవర్ లో జరిగే ఈ సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారట. ముగ్గురు పిల్లలకు తల్లి అయినా ఏంజలీనా తన శరీరసౌష్టవాన్ని ఎంతో బాగా కాపాడుకుంటూ వచ్చిందని, ఈ సీన్లు ఖచ్చితంగా సినిమా చూసే వారిలో వేడిని వంద రెట్లు పెంచేవిగా వుంటాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమా 2011లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











