twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భార్యకు వేధింపులు, హింసాత్మక దాడి’ కేసు.. లండన్ కోర్టుకు హాజరైన స్టార్ హీరో

    |

    భార్యను వేధిస్తూ దారుణంగా కొట్టారని వార్తలను ప్రచురించిన ది సన్ పత్రికపై పరువు నష్టం దావా వేసిన కేసులో హాలీవుడ్ నటుడు జానీ డెప్ లండన్ కోర్టుకు హాజరయ్యారు. తనను తన భార్య రాక్షసుడు అని పేర్కొంటూ దాడి చేశారని చేసిన ఆరోపణలను జానీ డెప్ ఖండించారు. మంగళవారం లండన్‌లోని హైకోర్టుకు హాజరయ్యారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాన్ని ప్రచురించిన పత్రికపై ఘాటుగా స్పందిస్తూ..

     2015లో పెళ్లి... 2017లో విడాకులు

    2015లో పెళ్లి... 2017లో విడాకులు

    హలీవుడ్ చిత్రం ది పైరేట్స్ ఆఫ్ ది కరిబియన్ మూవీతో ప్రేక్షకులకు సుపరిచితులైన జానీ డెప్‌కు మోడల్, యాక్టర్ అంబర్ హర్డ్‌ 2011లో రమ్ డైరీ అనే కామెడీ చిత్ర షూటింగ్ సందర్భంగా ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 4 ఏళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగిన తర్వాత 2015లో లాస్ ఎంజెలెస్‌లో వారిద్దరు వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయ, వ్యక్తిగత బేధాలు తలెత్తాయి. ఆ తర్వాత 2017లో వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు.

    భార్యను హింసించేవాడు అంటూ కథనం

    భార్యను హింసించేవాడు అంటూ కథనం

    జానీ డెప్, అంబర్ హర్డ్ మధ్య విభేదాలు పరిష్కరించుకోలేనంతగా పెరిగిపోయాయి. దాంతో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. జానీ, హార్డ్ మధ్య గొడవలపై ది సన్ పత్రిక కథనాన్ని వెల్లడించింది. జానీ భార్యను హింసించాడు. దారుణంగా కొట్టాడు అంటూ కథనంలో పేర్కొన్నారు. తనపై వచ్చిన కథనంతో మనస్తాపం చెందిన జానీ డెప్.. ది సన్ ఎడిటర్ డాన్ వూటన్‌పై 2018లో పరువు నష్టం కేసు వేశారు.

    లండన్ కోర్టులో జానీ డెప్

    లండన్ కోర్టులో జానీ డెప్

    ది సన్ పత్రికపై పరువు నష్టం దావా కేసులో లండన్ కోర్టుకు హాజరైన జానీ డెప్ సాక్షి బోనులో ప్రమాణం చేశారు. జాన్ క్రిస్టఫర్ డెప్ II అనే నేను, అంతా నిజమే చెబుతానంటూ ప్రమాణం చేశారు. భార్యను కొట్టేవాడు అంటూ కథనాన్ని ప్రచురించిన ది సన్ పత్రికకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. అవాస్తవాలను ప్రచురించి నా ప్రతిష్టను దిగజార్చారు అంటూ జానీ డెప్ తన వాదనను వినిపించారు.

    ప్రత్యేక ద్వారం ద్వారా ప్రవేశం

    ప్రత్యేక ద్వారం ద్వారా ప్రవేశం

    ది సన్‌పై వేసిన పరువు నష్టం దావా కేసుకు హాజరైన జానీ డెప్, అంబర్ హార్డ్ కోర్టు విచారణకు ప్రత్యేక ద్వారం ద్వారా ప్రవేశించారు. వారితో డెప్ సన్నిహితులు కూడా సాక్ష్యంలో భాగమయ్యారు. ఈ విచారణ మూడు వారాలపాటు సాగనున్నది. కరోనావైరస్ లాక్‌డౌన్ తర్వాత కోర్టు ముందుకు వచ్చిన తొలి కేసు జానీ డెప్ పరువునష్టం కేసు కావడం గమనార్హం.

    Recommended Video

    Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
     ది సన్ ఘాటుగా వాదనలు

    ది సన్ ఘాటుగా వాదనలు

    జానీ డెప్ పరువు నష్టం దావా కేసులో ది సన్ పత్రిక లీగల్ టీమ్ ధీటుగానే వాదనలు వినిపిస్తున్నది. 2013 నుంచి 2016 వరకు జానీ, హార్డ్ మధ్య దాదాపు 14 సంఘటనలు చోటుచేసుకొన్నాయి. లాస్ ఏంజెలెస్, ఆస్ట్రేలియా, జపాన్, బహమస్ ప్రదేశాల్లో హార్డ్‌పై హింసకు పాల్పడ్డారు. ఒకసారి ప్రైవేట్ జెట్‌లో కూడా వారిద్దరు గొడవ పడినట్టు ఆధారాలు ఉన్నాయి అని ది సన్ న్యాయ నిపుణులు పేర్కొన్నారు.

    English summary
    Hollywood actor Johnny Depp appeared in London court for libel case against The Sun. Johnny Deep sues of The Sun story related to his then wife amber heard assualt. Amber Heard and Depp divorced in 2018 after in appropriated relation between them. strongly denies the claim.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X