Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
అతనే అందరి కంటే సెక్సీయెస్ట్ మ్యాన్..!!
హాలీవుడ్ నటుడు జానీ డెప్ ఇప్పుడున్న వారందరిలోకీ సెక్సీయెస్ట్ మ్యాన్ గా నిలిచాడు. ప్రముఖ పత్రిక పీపుల్ మ్యాగ్జయిన్ నిర్వహించిన పోల్ లో జానీ అందరి కంటే ఎక్కువ ఓట్లు పొంది ఆ ఘనతని సాధించాడు. ఈ పత్రిక కథనం ప్రకారం ''పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్'' చిత్రంలో కెప్టెన్ జాక్ స్పారో గా అందరికీ సుపరిచితుడయిన జానీ ఈ సంవత్సరం నిర్వహించిన సెక్సీయెస్ట్ మ్యాన్ పోల్ లో అగ్రస్థానంలో నిలిచి ఈ ఏటి సెక్సీయెస్ట్ మ్యాన్ గా నిలిచాడు. ఇంతకు మునుపు 2003వ సంవత్సరానికి గాను ఈ టైటిల్ ను పొందిన జానీ కి ఈ టైటిల్ దక్కడం ఇది రెండవ సారి. దీంతో రెండు సార్లు ఈ టైటిల్ గెలుచుకొన్న ఘనత పొందిన జార్జ్ క్లోనీ మరియు బ్రాడ్ పిట్ ల సరసన ఈ కెప్టెన్ స్థానం పొందారు.
కాగా ఇప్పటికి హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న కథానాయకుడిగా నిలిచిన జానీ డెప్ ప్రస్తుతం ది టూరిస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అందులో ప్రపంచంలోనే సెక్సీయెస్ట్ ఉమన్ గా నిలిచిన ఏంజలీనా జోలీ అతనికి జోడీగా నటిస్తోంది.