twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాజీ భార్య మీద రూ. 370 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరో!

    |

    ప్రముఖ హాలీవుడ్ నటుడు, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీ సిరీస్ స్టార్ జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హియర్డ్‌ను శారీరకంగా, మానసికంగా వేధించినట్లు 2016లో ఆరోపణలు వచ్చినప్పుడు అభిమానులంతా షాకయ్యారు. ఈ కేసు కారణంగానే అతడి సినిమా కెరీర్ కూడా ప్రభావితం అయింది. మహిళను వేధించిన కారణంగా డిస్నీ సంస్థ భారీ చిత్రం నుంచి అతడిని తప్పించిన సంగతి తెలిసిందే.

    జానీ డెప్, అంబర్ హియర్డ్ మధ్య పొసగక పోవడంతో 2016లోనే వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా... జానీ డెప్ ఎలాంటి వ్యక్తో, తనపై ఏయే సందర్భాల్లో దాడి చేసి గాయపరిచాడో వెల్లడిస్తూ అంబర్ హియర్డ్ 2019 జనవరిలో కోర్టుకు సమర్పించిన పత్రాలు కొన్ని బయటకు లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేశాయి.

    ఖండిస్తూ వచ్చిన జానీ డెప్

    ఖండిస్తూ వచ్చిన జానీ డెప్

    అంబర్ హియర్డ్‌ తన భర్త చేతిలో తీవ్ర హింసకు గురైందనే వార్తలకు సరిపడా కొన్ని సాక్ష్యాలు కూడా మీడియాలో సర్క్యులేట్ కావడంతో ఆమెకు అభిమానుల నుంచి కూడా మద్దతు లభించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను జానీ డెప్ ఖండిస్తూ వచ్చారు.

    రూ. 370 కోట్ల పరువు నష్టం

    రూ. 370 కోట్ల పరువు నష్టం

    మూడేళ్ల తర్వాత జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ మీద తాజాగా 50 మిలియన్ డాలర్ల(రూ. 347 కోట్లు) పరువు నష్టం కేసు వేశాడు. ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఆమె వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని, తనపై అంబర్ దాడి కూడా చేసిందంటూ ఆధారాలతో సహా కేసు పెట్టాడు.

    ప్రియుడితో బ్రేకప్?.. శృతిహాసన్ డేరింగ్ నిర్ణయం.. అంతా మంచే.. వైరల్‌గా ట్వీట్ప్రియుడితో బ్రేకప్?.. శృతిహాసన్ డేరింగ్ నిర్ణయం.. అంతా మంచే.. వైరల్‌గా ట్వీట్

    జానీ డెప్ లా సూట్లో పేర్కొన్న వివరాలు ఇవే

    జానీ డెప్ లా సూట్లో పేర్కొన్న వివరాలు ఇవే

    అంబర్ హియర్డ్‌ తనపై దాడి చేసిందని, తన వేలిని కత్తించిందని తన లా సూట్లో జానీ డెప్ ఆరోపించారు. వోడ్కా బాటిల్ విసరడంతో తన వేలికి తీవ్రగాయం అయిందని, ఎముక విరిగినట్లు తెలిపారు. బెడ్ మీద ఉన్నపుడు తనపై పిడిగుద్దులతో దాడి చసినట్లు పేర్కొన్నారు.

    మే 2016లో సంఘటన

    మే 2016లో సంఘటన

    మే 2016లో ఈ సంఘటన చోటు చేసుకుందని, ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడే ఉన్నారని జానీ డెప్ వాదిస్తున్నారు. అందుకు తగిన సాక్ష్యాలు కూడా సమర్పించాడు. మరి ఇప్పుడు ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    English summary
    Johnny has lashed out and filed a 50 million dollar (Rs 347 crore) defamation case against ex-wife Amber Heard and has presented evidence that he was on the receiving end of the abuse.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X