అతడొక రాక్షసుడు: స్టార్ హీరోపై మాజీ భార్య సంచలనం, కీలకంగా మారిన లీక్!

'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' ఫేం, హాలీవుడ్ టాప్ యాక్టర్ జానీ డెప్ ఈ మధ్య కాలంలో తరచూ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అతడి మాజీ భార్య అంబర్ హియర్డ్ ఈ అగ్ర నటుడిపై సంచలన ఆరోపణలు చేసిన విషయం బయటకు వచ్చింది. అతడొక రాక్షసుడని, తనను తీవ్రంగా హింసించే వాడని ఆమె ఆరోపించిన పత్రాలు లీక్ అయ్యాయి.

జానీ డెప్, అంబర్ హియర్డ్ మధ్య పొసగక పోవడంతో 2016లోనే వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా జానీ డెప్ ఎలాంటి వ్యక్తో, తనపై ఏయే సందర్భాల్లో దాడి చేసి గాయపరిచాడో వెల్లడిస్తూ అంబర్ హియర్డ్ కోర్టుకు సమర్పించిన పత్రాలు కొన్ని బయటకు లీక్ అయ్యాయి. హాలీవుడ్ మీడియా అందులోని వివరాలు బయటపెట్టింది.

అతడొక రాక్షసుడు

అతడొక రాక్షసుడు

లీకైన పత్రాల్లోని 471వ పేజీలో తన మాజీ భర్త జానీ డెప్ మీద అంబర్ హియర్డ్ సంచలన ఆరోపణలు చేశారు, అతడు రాక్షసుడని, తీవ్రంగా కొడుతూ హింసించేవాడని ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం లీక్ కావడం ఇంటర్నేషనల్ మీడియాలో సంచలనం అయింది. దీంతో జానీ డెప్ మహిళలను హింసించే వ్యక్తిగా ముద్రపడిపోయాడు.

పశ్నించిన అంతర్జాతీయ పత్రికలు

పశ్నించిన అంతర్జాతీయ పత్రికలు

అంతే కాదు.. ఈ వివాదాలు చివరకు అతడు సినిమా అవకాశాలు కోల్పోవడానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి ప్రవర్తన గల వ్యక్తిని ఎలా సినిమాల్లో తీసుకుంటారంటూ ప్రశ్నిస్తూ ‘ది సన్' లాంటి అంతర్జాతీయ పత్రికలు ఇప్పటికే పలు కథనాలు సైతం ప్రచురించాయి.

కీలకంగా మారిన లీక్ డాక్యుమెంట్స్

కీలకంగా మారిన లీక్ డాక్యుమెంట్స్

అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ జానీ డెప్ ఆయా పత్రికలపై పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన అంబర్ హియర్డ్ ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కీలకంగా మారాయి.

జానీ డెప్‌ను తొలగించారు, 700 కోట్లు మిగిలాయి

జానీ డెప్‌ను తొలగించారు, 700 కోట్లు మిగిలాయి

కాగా... ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' నెక్ట్స్ సీక్వెల్‌ నుంచి డిస్ని సంస్థ జానీ డెప్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. అతడిని ఈ సినిమా నుంచి తొలగించడం వల్ల నిర్మాణ సంస్థకు 100 మిలియన్ డాలర్లు మిగిలినట్లు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. అంటే దాదాపు రూ. 700 కోట్ల రూపాయలన్నమాట. అతడు తీసుకునే రెమ్యూనరేషన్, లాభాల్లో వాటా విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X