క్రేజీ హీరోని తీసేయడం వల్ల 700 కోట్లు మిగిలాయి.. కారణం మాజీ భార్యపై వేధింపులే!

Recommended Video

Pirates of the Caribbean : Disney Saves 700 Crores Profit By Dropping John Depp Filmibeat Telugu

'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఐదు సిరీస్ లుగా ఈ చిత్రం ప్రపంచ సినీ అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రముఖ నటుడు జానీ డెప్ క్రేజీ హీరోగా మారాడు. ఈ సిరీస్ మొత్తం జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ నటించాడు. అతడి నటనకు గాను ఆస్కార్ అవార్డు కూడా లభించింది. డిస్ని సంస్థ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆరో సిరీస్ కు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆరవ భాగం నుంచి జానీ డెప్ ని తొలగించినట్లు వచ్చిన వార్తప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 పడవ నుంచి దించేశారు

పడవ నుంచి దించేశారు

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రం సముద్రం, ఓడలు నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రంలో జానీ డెప్ జాక్ స్పారో పాత్రలో విచిత్రమైన గెటప్ లో కనిపిస్తాడు. అతడి వేషధారణ, నటన అందిరికి విపరీతంగా నచ్చేసింది. అందుకే ఈ ప్రాంచైజీకి ఉన్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వేలకోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ చిత్రంలో కీలక పాత్రధారి అయిన జానీ డెప్ నే తొలగించడంతో అతడి అభిమానులంతా షాక్ కు గురయ్యారు.

700 కోట్లు మిగిలాయి

700 కోట్లు మిగిలాయి

పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రాన్ని డిస్ని సంస్థ నిర్మిస్తోంది. ఆరవ భాగం నుంచి జానీ డెప్ ని తొలగించడం వలన డిస్ని సంస్థకు 100 మిలియన్ డాలర్లు మిగిలినట్లు ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు. ఇది నిజంగా సంచలన రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. జానీ డెప్ కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో వాటా కూడా తీసుకుంటాడట.

మాజీ భార్యపై వేధింపులు

మాజీ భార్యపై వేధింపులు

జానీ డెప్ ని తొలగించడానికి స్పష్టమైన కారణాలు మాత్రం బయటకు రాలేదు. అతడు తరచుగా మాజీ భార్య అంబర్ హార్ట్ ని వేధిస్తుంటాడట. ఆమె చేసిన వేధింపుల ఆరోపణల కారణంగానే డెప్ నిఆరవభాగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. జానీ డెప్ కోసమే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చూసే అభిమానులు ఉన్నారు. అతడు లేకుండా ఈ చిత్రం ఈమేరకు రాణిస్తుందో చూడాలి.

 ఇకపై నటీమణులే

ఇకపై నటీమణులే

ఇకపై పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ లో నటీమణులే ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల డెప్ టైం కూడా సరిగా లేదు. అతడు నటించిన చిత్రాలు వరుసగా నిరాశ పరిచాయి. డెప్‌ నటించిన మోర్ట్‌డెకాయ్, ట్రాన్సెన్డెన్స్‌, ది లోన్‌ రేంజర్ సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కూడా చేజారడంతో డెప్ తీవ్ర నిరాశలో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X