నటించడేమే కాదు పాటలు కూడా బాగానే పాడుతానంటున్న హీరో..
నటనలో తనకంటూ ఓప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు స్ట్రార్ హీరో జానీ డెప్. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరీస్ లలో జానీ డెప్ లేకుండా ఊహించుకోలేం అనేవిధంగా చేశారు ఆయన యాక్షన్. జానీ డెప్ మంచి గిటారిస్ట్ కూడా. అంతేకాకుండా ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు పాడడం విన్నాం. మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, జూ ఎన్టీఆర్, సిద్దార్ద్ లాంటి వాళ్శు పాటలు పాడడం విన్నాం. ఇప్పుడు హాలీవుడ్ లోకూడా ఇదే సాంప్రదాయం కోనసాగుతుంది. తనకు బాగా ఇష్టమైనటువంటి షెప్పల్డ్ బ్యాండ్ కోసం ఏకంగా పాటపాడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు జానీ డెప్.
బేబి బర్డ్ ఫ్రంట్ మ్యాన్ స్టీపెన్ జోన్స్ ప్రత్యేకంగా రాసినటువంటి ఈపాటను జానీ డెప్ పాడడం జరిగింది. గతంలో కూడా జానీడెప్ 'అన్ లవ్ బుల్' అనే వీడియో ఆల్బమ్ ప్రదర్శన లో గిటార్ చేతపట్టి శ్రోతలను ఆనందపరచడమే కాకుండా వీడియో సాంగ్ కి దర్శకత్వం కూడా వహించారు.
హాలీవుడ్ అలనాటి క్లాసికల్ మూవీ ది లోనీ రేంజర్ సినిమాని రీమేక్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్ డైరెక్టర్ గోరి వెర్బిన్స్కి ఆసినిమా హాక్కులను సోంతం చేసుకున్నారు. ఈసినిమాని ప్రఖ్యాత హాలీవుడ్ సంస్ధ డిస్నీ వారు రూపోందించడం జరుగుతుంది. ఐతే ఈసినిమాలో నటించడానికి గాను ఆర్టిస్టుల వేట మొదలు పెట్టినటువంటి డైరెక్టర్ ముందుగా పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్ హీరో జానీ డెప్ నిఓపాత్ర కోసం తీసుకోవడం జరిగింది. జానీ డెప్ ఇందులో టోంటో అనే పాత్రలో నటించనున్నారు. ఇంకోక హీరో డైరెక్టర్ వెతుకుతుండగా హీరో జానీ డెప్ కలగజేసుకోని ఈసినిమాలో ఉన్న లీడ్ రోల్ కు హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ఐతే బాగుంటుందని డైరెక్టర్ కుచూచించడం జరిగిందంట. ఇలా జానీ డెప్ ఎప్పుడూ ఎటువంటి స్వార్దం లేకుండా తనపని తాను చేసుకుంటూ పోతాడు.


Click it and Unblock the Notifications











