క్రేజీ హీరో మరో సంచలనం.. తనకన్నా 30 ఏళ్ళు చిన్నదైన యువతితో వివాహం!

'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' సిరీస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఐదు సిరీస్ లుగా ఈ చిత్రం ప్రపంచ సినీ అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రముఖ నటుడు జానీ డెప్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రపంచం మొత్తం అతడి క్రేజ్ వ్యాపించింది. ఈ సిరీస్ మొత్తం జాక్ స్పారో పాత్రలో జానీ డెప్ నటించాడు. అతడి నటనకు గాను ఆస్కార్ అవార్డు కూడా లభించింది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకే హాలీవుడ్ నటుల జాబితాలో జానీ డెప్ కూడా ఉంటాడు. గత కొంత కాలంగా జానీ డెప్ ని అటు వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వివాదాలు వెంటాడుతున్నాయి. జానీ డెప్ తాజాగా మరో సంచలన వార్తతో హాట్ టాపిక్ గా మారాడు.

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు

జానీ డెప్ 2017లో తన మాజీ భార్య అంబర్ హార్డ్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయినప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డెప్ తనని చిత్రవధకు గురిచేసేవాడని అంబర్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంబర్ వల్లే తాను సినిమా అవకాశాలు కోల్పోతున్నానని డెప్ ఆరోపిస్తున్నాడు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. జానీ డెప్ జీవితంలో ఇప్పటికే రెండు వివాహాలు బెడిసికొట్టాయి.

రష్యన్ డాన్సర్

రష్యన్ డాన్సర్

జానీ డెప్ మొదటి వివాహం 1983లో అన్నే అల్లిసన్ అనే మోడల్ తో జరిగింది. వివాహమైన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జానీ డెప్ అంబర్ హార్డ్ అనే హాలీవుడ్ బ్యూటీతో ప్రేమాయణం మొదలు పెట్టాడు. 2015లో ఈ జంట వివాహం చేసుకుంది. రెండేళ్లకే ఇద్దరి మధ్య గొడవలు మొదలై 2017లో విడిపోయారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. 2018లో జానీ డెప్ మరో యంగ్ బ్యూటీతో ఎఫైర్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పోలినా గ్లేన్ అనే రష్యన్ డాన్సర్ తో జానీ డెప్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నాడట.

 మూడో పెళ్ళికి రెడీ

మూడో పెళ్ళికి రెడీ

జానీ డెప్, పోలినా త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పోలినా వయసు 25 ఏళ్ళు. జానీ డెప్ వయసు 55 ఏళ్ళు. అంటే జానీ డెప్ కన్నా పోలినా వయసులో 30 ఏళ్ళు చిన్నది. త్వరలో వివాహం గురించి పోలినా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు డెప్ రష్యాకు బయలుదేరుతున్నట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని ఓ పార్టీలో జానీ డెప్ కు పోలినాతో పరిచయం ఏర్పడిందట. పోలినా అందానికి ముగ్దుడైన డెప్ ఆమెతో ప్రేమలో పడ్డాడని అంటున్నారు.

కెరీర్‌లో ఒడిదుడుకులు

కెరీర్‌లో ఒడిదుడుకులు

డెప్ తన మాజీ భార్య అంబర్ హార్డ్ నుంచి విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ నుంచి డిస్ని సంస్థ డెప్ ని తొలగించింది. ఇది డెప్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం డెప్ 'వెయిటింగ్ ఫర్ ది బార్బేరియన్స్' చిత్రంలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X