ఆమె వల్లనే, 14 యేళ్ల కలిసి జీవించిన జంట విడిపోతుందా..?

By Nageswara Rao

న్యూయార్క్, జూన్ 20: హాలీవుడ్ సెలబ్రిటీ జంటగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న జానీ డెప్, వెనెస్సా పారదిస్ విడిపోతున్నట్లు ప్రకటించారు. గత 14 సంవత్సరాలుగా కలిసి జీవితాన్ని గడిపిన వీరిద్దరూ తీసుకున్న ఈ నిర్ణయం అందిరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ విషయాన్ని జానీ డెప్ అధికార ప్రతినిధి అధికారకంగా ప్రెస్ రిలీజ్‌ ద్వారా విడుదల చేశారు. ప్రెస్ రిలీజ్‌లో జానీ డెప్ అతని భార్య వెనెస్సా ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోతున్నారని ఉంది.

దీనితో పాటు దయచేసి వారి గోప్యతతో పాటు ముఖ్యంగా, వారి పిల్లల గోప్యతను గౌరవించాల్సిందిగా కోరారు. జానీ డెప్ 49 సంవత్సరాలు కాగా.. వెనెస్సా వయసు 39 సంవత్సరాలు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు.

1998 వేసవి: నాలుగు సంవత్సరాలుగా సూపర్ మోడల్ కేట్ మోస్‌తో డేటింగ్ చేసిన జానీ డెప్ పారిస్ లోని ఓ హోటల్‌లో వెనెస్సాని కలిశాడు.

మే 1999: కుమార్తె లిల్లీ-రోజ్ మెలోడీ పుట్టింది.

ఏప్రిల్ 2002: సన్ జాన్ 'జాక్' క్రిస్టోఫర్ పుట్టాడు.

ఫిబ్రవరి 2008: ఇద్దరూ కలిసి అకాడమీ అవార్డుల ఫంక్షన్‌కి హాజరయ్యారు.

మే 2010: జానీ డెప్, వెనెస్సా ఇద్దరూ కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఛానల్ పార్టీకి హాజరయ్యారు. వీరిద్దరి కలయికతో హాజరైన చివరి పార్టీ ఇదే కావడం విశేషం.

జనవరి 2012: ఫ్రెంచ్ టీవి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెనెస్సా, డెప్ విడిపోతున్నారని వాదనను వెనెస్సా ఖండన.

ఏప్రిల్ 2012: జానీ డెప్ తో కలిసి డార్క్ షాడోస్ నటించిన కోస్టార్ ఆంబర్ హెర్డ్ .. డెప్ ప్రయివేట్ జెట్‌లో లాస్ వేగాస్‌లో ప్రమోషన్‌లో పాల్గోనడం.

మే 2012: డార్క్ షాడోస్ లండన్ ప్రీమియర్ షో లో జానీ డెప్.. వెనెస్సా విడిపోనున్న వార్తలు ఖండన.

జూన్ 2012: జానీ డెప్ అధికార ప్రతినిధి.. స్నేహా పూర్వకంగా జానీ డెప్, వెనెస్సా విడిపోతున్నారని అధికారిక ప్రకటన.

దీనిని బట్టి చూస్తుంటే జానీ డెప్‌తో డార్క్ షాడోస్ లో తనతో పాటు నటించిన కోస్టార్ ఆంబర్ హెర్డ్ తో ప్రేమలో పడడం వల్లనే వెనెస్సా నుండి విడిపోయినట్లు హాలీవుడ్ లో వీరికి బాగా కావాల్సిన దగ్గరి బంధువులు గుసగుస లాడుతున్నారు.

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X