కామెడీ హీరో అందాలు నగ్నంగా కవర్ పేజీపై దర్శనం
వ్యానిటీ ఫెయిర్ మ్యాగజైన్‌కు గతంలో డెమిమోరీ ప్రగ్నెంట్‌గా ఉన్నప్పుడు నగ్నంగా ఓ ఫోజు ఇవ్వడం జరిగింది. సాధారణంగా నగ్నంగా మ్యాగజైన్ కవర్ పేజీలపై అమ్మాయిలు ఫోజులివ్వడం మనం చాలా చూశాం. ఐతే దీనికి భిన్నంగా హాలీవుడ్‌లో ఓ పాపులర్ కమెడియన్ అయిన జానీ వేగాస్‌కి హాఠాత్తుగా ఏమి బుద్ది పుట్టిందో ఏమోగానీ సడన్‌గా అచ్చం డెమిమోరీ ఏవిధంగానైతే వ్యానిటీ ఫెయిర్ మ్యాగజైన్‌కి నగ్నంగా ఫోజు ఇచ్చిందో అదే మాదిరి తను కూడా ఫోజు ఇవ్వడం జరిగింది. దాంతో ఒక్కసారి ఈ కమెడియన్ అభిమానులు బెంబెలెత్తిపోవడం జరిగింది.
అంతేకాకుండా 40 సంవత్సరాల వయసులో ఈయనకు ఇదేం పోయే కాలం అంటూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. 1991లో వ్యానిటీ ఫెయిర్ మ్యాగజైన్‌కి డెమిమోరి ఏడు నెలలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నగ్నంగా ఈ ఫోజు ఇవ్వడం జరిగింది. జానీ వేగాస్ ఇచ్చిన ఈ ఫోజుని పెద్దదిగా చేసి నేషనల్ పొట్రేయట్ గ్యాలరీ పెట్టగా జానీ అభిమానులు ఫన్నీమ్యాన్ అంటూ నవ్వుకోసాగారు.
ఇక జానీ వేగాస్ నగ్నంగా ఇచ్చిన ఫోటో ఫోజుని గనుక చూసినట్లైతే అతని ముఖం వైపు చూడగానే నవ్వువచ్చేవిధంగా, ఇక అతని పోట్టను గనకు చూస్తే అచ్చం తొమ్మిది నెలలు పొట్ట గలిగిన ఆడవారిలాగా ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా నవ్వుబాట పడుతున్నారు. డెమి మోరి ఒక చేతితో పోట్టను అదిమి పట్టుకోగా, మరో చేతితో తన హృదయాన్ని పట్టుకోవడం జరిగింది. సరిగ్గా జానీ వేగాస్ కూడా అదే విధంగా ఈ ఫోటోలో ఫోజు పెట్టడం జరిగింది. చెవికి కూడా ప్రత్యేకంగా రూపోందించిన బంగారపు రింగ్‌ని పెట్టుకోవడం జరిగింది.


Click it and Unblock the Notifications











