అలనాటి క్లాసికల్ చిత్రం రీమేక్ లోఆయన ఉంటే ఇంకా బాగుంటుంది..
హాలీవుడ్ అలనాటి క్లాసికల్ మూవీ ది లోనీ రేంజర్ సినిమాని రీమేక్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్ డైరెక్టర్ గోరి వెర్బిన్స్కి ఆసినిమా హాక్కులను సోంతం చేసుకున్నారు. ఈసినిమాని ప్రఖ్యాత హాలీవుడ్ సంస్ధ డిస్నీ వారు రూపోందించడం జరుగుతుంది. ఐతే ఈసినిమాలో నటించడానికి గాను ఆర్టిస్టుల వేట మొదలు పెట్టినటువంటి డైరెక్టర్ ముందుగా పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్ హీరో జానీ డెప్ నిఓపాత్ర కోసం తీసుకోవడం జరిగింది. జానీ డెప్ ఇందులో టోంటో అనే పాత్రలో నటించనున్నారు. ఇక మిగిలిన నటీనటుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
ఇలాంటి సందర్బంలో పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్ హీరో జానీ డెప్ కలగజేసుకోని ఈసినిమాలో ఉన్న లీడ్ రోల్ కు హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ఐతే బాగుంటుందని డైరెక్టర్ కుచూచించడం జరిగిందంట. అలా సూచించడానికి కారణాలు తెలియజేస్తూ జానీడెప్ బ్రాడ్ పిట్ యాక్షన్ నేను చాలా సినిమాలలో చూశాను. అంతేకాకుండా ఇదోక క్లాసికల్ రీమేక్ సినిమా కాబట్టి ఇందులో నటించే హీరోలు వాళ్శ శైలిలో నటిస్తే బాగుంటుందని నాఅభిప్రాయం అందుకే అలా చెప్పడం జరిగిందని అన్నారు.
ఇకపోతే ఈసినిమా విషయానికి వస్తే ఇందులో నేటివ్ అమెరికన్స్ గురించి వర్ణించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎన్నో సంవత్సరాల నుండి నేటివ్ అమెరికన్స్ ఎటువంటి ఇబ్బందులకు గురిఅవ్వుతున్నారు, ఎలా వారు హీనంగా చూడబడుతున్నారనేది ముఖ్యంగా ఈసినిమాలో చూపించడం జరుగుతుందని అన్నారు. చివరగా వారు ఆఇబ్బందులు ఎలా ఎదుర్కున్నారు అనే చక్కని కధాంశంలో రూపోందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











