వారిద్దరి మధ్య గొడవ చెయ్యి చేసుకునే వరకూ వెళ్లింది..!!
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ ఓ విలక్షణమయిన వ్యక్తిత్వం కల యువతి. కోపం వస్తే ఆమె త్రాచు పాములా మీదకు ఎగురుతుందని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతుంటారు. అలా ఎవరి మీదనైనా తనకున్న కోపాన్ని ముఖానే ప్రదర్శించే జోలీ ఈ సారి మరింతగా ముందుకెళ్లి చేయి చేసుకునే స్థాయికి వచ్చిందట. ఆమె చెయ్యి చేసుకున్నది ఎవరి మీదనో కాదు తన సహచరుడు బ్రాడ్ పిట్ మీద కావడం విశేషం.
దీనికంతటికీ కారణం జోలీకి అస్సలు గిట్టని బ్రాడ్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్. ఇటీవల జోలీతో మాట్లాడుతూ బ్రాడ్ పిట్ తాను తన మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ తో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పడంతో విచక్షణ కోల్పోయిన ఏంజీ పిట్ మీద విరుచుకుపడిందట. దీంతో ఆమె వ్యవహారం చెయ్యి చేసుకునే వరకూ వెళ్లిందట. దీంతో బిత్తరబోయిన బ్రాడ్ ఇకపై ఆ సంబంధానికి అడ్డుకట్ట వేస్తానని మాట ఇచ్చాడంట. ఇదంతా విన్న వారు బ్రాడ్ అనిస్టాన్ తో సంబంధానికి అడ్డుకట్ట వేసేబదులు జోలీతో బంధానికి అడ్డుకట్ట వేస్తే అతనికి మంచిదని సలహాలు ఇస్తున్నారట.


Click it and Unblock the Notifications











