'వాటర్ ఫాల్' గిప్ట్‌గా ఇచ్చిన సూపర్ స్టార్
హాలీవుడ్ బెస్ట్ కపుల్ అంటే చాలా మంది నోటి వెంట వచ్చే సమాధానం బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీ. వీరిద్దరూ పెళ్లి చేసుకోపోయినప్పటికీ గత కొన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సామాజిక కార్యక్రమాలలో వీరిద్దరూ కలిసి పాల్గోంటున్న విషయం తెలిసిందే. ఇటీవల బ్రాడ్ పిట్ పుట్టిన రోజు కానుకగా బ్రాడ్ పిట్‌పై ఉన్న ప్రేమను తెలిపేందుకు గాను ఏంజిలీనా జోలీ 'వాటర్ ఫాల్'ని గిప్ట్‌గా ఇచ్చింది.
పోయిన సంవత్సరం ఏంజిలీనాజోలీ రూరల్ కాలిఫోర్నియాలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర భూమిని కొన్నారన్న విషయం హాల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆ భూమిలో బ్రాడ్ పిట్‌కు తెలియకుండా ఫ్రాంక్ లాయిడ్ రైట్ ద్వారా అందమైన వాటర్ ఫాల్ ఎస్టేట్‌ని రూపొందించి, తన పుట్టిన రోజు కానుకగా బ్రాడ్ పిట్‌కు అందజేసింది.
బ్రాడ్ పిట్‌కు తన ఇళ్లు వాటర్ ఫాల్ పైన ఉండే విధంగా కట్టుకోవాలనే కోరిక ఉండేదని జోలీకి చెప్పడంతో బ్రాడ్ పిట్ కోరికను అనుకున్నదే తడవుగా అమలు పరిచింది. 6 సంవత్సరాలు వయసు కలిగిన ఏంజిలీనా జోలి 1998వ సంవత్సరం నుండి బ్రాడ్ పిట్‌తో కలసి సంసారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. బ్రాడ్ పిట్ ద్వారా ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లైన జోలి త్వరలో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ఈ ఇంటర్యూలో తెలిపారు. తాను దర్శకత్వం వహించిన 'ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా విశేషాలతో పాటు, తన పిల్లలు గురించి సరదాగా కబుర్లు చెప్పారు.
ప్రస్తుతం మాకు ఆరుగురు పిల్లలు. మాడెక్స్(10), పాక్స్(8), జహారా(6), షైలో(6), నాక్స్(3), వివిన్నే(3). మా పిల్లలు గత కొంత కాలంగా నన్ను, బ్రాడ్ పిట్‌ని పెళ్లి చేసుకోమని కోరుతున్నారన్నారు.


Click it and Unblock the Notifications











