తన సవతిని మరో సారి చిత్తు చేసిన స్టార్ హీరోయిన్...!!
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ ఈ దశాబ్దపు అందమైన యువతిగా ఎంపికయింది. యుకె కేంద్రం గా పనిచేస్తున్న హెల్త్ అండ్ రిటెయిలర్ సూపర్ డ్రగ్ నిర్వహించిన సర్వేలో జోలీ ఈ ఘనతను సాధించింది. ఇంతకు ముందు రెండు సార్లు ప్రపంచ సెక్సీ మహిళగా ఎంపికయిన జోలీ ఈ సర్వేలో కూడా ప్రథమ స్థానంలో నిలిచి తన పదును ఇంకా తగ్గలేదని నిరూపించింది.
మూడు పదుల వయసు దాటిన ఈ సుందరి తన అందం కన్నా దృఢమయిన వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షించిందని ఈ సర్వేలో ఎక్కవ మంది అభిప్రాయపడ్డారు. కాగా జోలీ పేరు చెబితేనే ఒంటి కాలు మీద లేచే ఆమె సవతి బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ అనిస్టాన్ ఈ సర్వేలో రెండవ స్థానంలో నిలిచింది.
ఏంజలీనా జోలీ జెన్నిఫర్ అనిస్టాన్ బ్రాడ్ పిట్ హాలీవుడ్ సూపర్ డ్రగ్ angelina jolie jennifer aniston beauty icon brad pitt hollywood superdrug


Click it and Unblock the Notifications