'మదర్ థెరిస్సా' ఆదర్శంగా సేవలు చేస్తున్న తార..!!
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ ఇతరులకు సాయం చెయ్యడంలో చాలా ఔదార్యం గల వ్యక్తి. తనకు బ్రాడ్ పిట్ కు ముగ్గురు పిల్లలు వున్నా మరో ముగ్గురు అనాధ పిల్లలను దత్తతకు తీసుకొని వారి ఆలనాపాలనా చూస్తోంది. అంతే కాదు ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎక్కడ ఏ వైపరిత్యం జరిగినా తన వంతు సాయం చెయ్యడమే కాకుండా, ఆ ప్రదేశాలను సందర్శించి మరీ వారి బాధలను అడిగి తెలుసుకొని సాయం చెయ్యడం ఆమెకే చెల్లింది.
తాజాగా ఆమె గత జనవరి నెలలో భూకంపంతో కంపించిపోయిన హైతీలోని నిరాశ్రయులను పరామర్శించి వారి బాధలను అడిగిమరీ తెలుసుకున్నారు. అంతే కాకుండా అక్కడ అనాధగా మారిన ఓ చిన్నారిని దత్తతకు తీసుకోనుందట. దీంతో పాటు అక్కడ స్వచ్ఛందంగా పనిచేస్తున్న డాక్టర్లకు మిలియన్ డాలర్లను విరాళంగా అందించి శభాష్ అనిపించుకుంది.
ఏంజలీనా జోలీ బ్రాడ్ పిట్ హైతీ భూకంపం హాలీవుడ్ ఐక్యరాజ్యసమితి angelina jolie brad pitt haiti earth quake hollywood


Click it and Unblock the Notifications