తండ్రీకూతుళ్లను కలిపిన ఆ సూపర్ హీరో
తండ్రి, కూతుళ్ల మధ్య అనుభందం చిన్న చిన్న గొడవలున్నా, చాలా ఆప్యాయంగా వుంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తారకు మాత్రం తన తండ్రి ప్రేమ అంటే మరచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏడేళ్ల పాటు ఆమెకు, తన తండ్రికి మధ్య మాటలులేకపోవడమే... హాలీవుడ్ తార, ఆస్కార్ అవార్డ్ నటి ఏంజలీనా జోలీకి తన తండ్రి జాన్ వోయిట్ కు ఏడేళ్ల కాలం నుండీ మాటలు లేవు. కారణాలు ఏవైనా వీరిద్దరూ ఈ ఏడేళ్లలో కనీసం ఒక్క సారి కూడా మాట్లాడుకోలేదు. కనీసం ఫోనులో కూడా వారు క్షేమసమాచారాలు ఆరా తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారట.
ఈ విషయాన్ని స్వయంగా వోయిట్ యుయస్ వీక్లీ మ్యాగ్జయిన్ కు ఇచ్చిన ఇంటర్యాలో వెళ్లడించారు. గత ఫిబ్రవరి నెలలో వీరిద్దరూ ముఖాముఖి మాట్లాడుకొని, తమ మధ్య వున్న స్పర్థలకు తెరదించారట. ఈ భేటీకి జోలీ సహచరుడు బ్రాడ్ పిట్ ముఖ్యకారణం అట. వోయిట్ మాట్లాడుతూ తామిద్దరం తరచుగా మాట్లాడుకోకున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నామని, అన్నిటికీ మించి తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని... అది చాలని ఈ 70 ఏళ్ల మాజీ కౌబాయ్ చెప్పుకొచ్చాడు. ఈ తతంగం అంతా చూసిన వారు బ్రాడ్ తండ్రీకూతుళ్లను కలిపాడని అతన్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











