జోలీ, బుల్లక్ లకే అభిమానుల పట్టం...!
హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ సంద్రా బుల్లక్ మరియు ఏంజిలీనా జోలీ ఇద్దరూ స్వచ్చంధ సంస్దల తల్లులుగా టాప్ లిస్ట్‌లో ఉన్నారని ఇటీవల సర్వే నిర్వహించిన ఓ ప్రముఖ మ్యాగజైన్ పేర్కోంది. వివరాల్లోకి వెళితే పేరంట్స్ మ్యాగజైన్ ఎడిటర్స్ టాప్ టెన్ సెలబ్రిటీ తల్లుల వివరాలను తీసుకోని ఓ సర్వే నిర్వహించగా అందులో జోలీ, బుల్లక్‌లకు అభిమానులు పట్టం కట్టారు.
2010వ సంవత్సరంలో సాంద్రా బుల్లక్ న్యూ ఆర్ల్నీల్స్‌లో లూయిస్ అనే పాపను దత్తతు తీసుకున్నారు. ఇక ఏంజిలీనా జోలీ విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్‌గా కొనసాగుతూ ఆరుగురు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని అభిమానులు కొనియాడారు. వీరితో పాటు పిల్లలకు అక్షరాస్యత అందించాలని తన వంతు ప్రచార కార్యక్రమాలను చేపట్టిన హీరోయిన్ జెన్నిఫర్ గార్నర్ వీరిద్దరి తర్వాత స్దానం సంపాదించుకున్నారు.


Click it and Unblock the Notifications











