స్క్రీనింగ్‌లో కంట నీరు పెట్టుకున్న సూపర్ స్టార్

By Nageswara Rao

హాలీవుడ్ సూపర్ స్టార్స్ ఏంజిలీనా జోలీ, బ్రాడ్ పిట్ ఇద్దరూ గత ఆరు సంవత్సరాలుగా కలసి జీవిస్తున్న విషయం తెలిసిందే. జోలీ కొత్తగా దర్శకత్వ బాధ్యతలను సేకరించి ఎంతో కష్టపడి 'ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' అనే సినిమాని తీశారు. ఈ సినిమాకు సంభంధించిన ప్రీమియర్‌ని సారజేవో, బోస్నియాలో ప్రదర్శించారు. దీనిని వీక్షించేందుకు బ్రాడ్ పిట్, జోలీ ఇద్దరూ కూడా ఒకే విధమైన నలుపు దుస్తులను ధరించి ఓ ప్రయివేట్ జెట్ విమానాన్ని తీసుకోని బోస్నియా విమానాశ్రయం వచ్చారు.

చలువ కళ్లద్దాలను ధరించి బ్రాడ్ పిట్ దిగగా విమానాశ్రయంలో పనిచేస్తున్న బధ్రతా సిబ్బందితో పాటు అభిమానులు వారిని చూసేందుకు ఎగబడగా వారితో సరదాగా కాసేపు ముచ్చటిస్తున్న సమయంలో జోలీ యొక్క జుట్టు ఆమె భుజాల చుట్టూ విశృంఖలగా, విస్తారంగా నవ్వుతూ మరియు కదలటం, అక్కడున్న వారిని సంతోషంగా మాట్లాడుతూ రిలాక్స్డ్ కనిపించారు.

ఆ తర్వాత 'ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హానీ' సినిమా ప్రీమియర్ అయిన తర్వాత జోలీ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సినిమాని మీతో షేర్ చేసుకోవడానికి గల కారణం ప్రపంచం నాతో ఉందని అన్నారు. అంతేకాకుండా నా జీవితంలో ఓ రాత్రి లోతుగా కదిలే ఆలోచలనతో కూడుకోని ఉందని నాకే తెలియదని అన్నారు. ఆ తర్వాత ఇంటర్యూలో జోలీ అంతక ముందు రోజు తాను పిట్‌తో కూర్చోని ఈ సినిమా గురించి ఆలోచిస్తున్న సందర్బంలో పిట్ నా చేయిని గట్టిగా పట్టుకోగా.. నేను కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు.

ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే బాస్నియన్ యుద్ధం నేపథ్యానికి సంబంధించినది. బాస్నియన్ సెర్బియా సైనికుడు గోరన్ తన మాజీ ప్రేయసి అజ్లా సైనిక జైలు శిబిరంలో ఒక నిర్బంధిగా ఉంటే తనని ఎలా రక్షించుకుంటాడో ముఖ్య కధాంశంగా సాగుతుంది. ఇక ఈ సినిమా దర్శకత్వ అనుభవం తన జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నారు. ఈ సినిమా గురించి ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తీశాను. ఎందుకంటే దర్శకత్వ బాధ్యతలు చెపట్టినప్పుడు మనమే అన్ని తానై నడింపాలి కాబట్టి. ఈ చిత్రానికి సంబంధించి నేను తెలుసుకున్న నిజాలు నా మనసుని ఎంతో బాధించడమే కాకుండా కొంచెం కోపాన్ని తెప్పించాయి.

ప్రభుత్వ అణిచివేత ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా.. సిరియా లాంటి దేశాలలో ప్రజలు అమానుషకు గురి అవుతున్నారో వాటిని నిరోధించడానికి అంతర్జాతీయ కమ్యూనిటీ ఒక 'వేక్ అప్ కాల్' గా ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X