బిల్ క్లింటన్ పై కన్నేసిన సెక్సీ నటీమణి...!!
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ వ్యక్తిగత జీవితం ఎంత వివాదాశ్పదంగా వుంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు జాన్నీ లీ మిల్లర్ మరియు బిల్లీ బాబ్ థార్న్ టన్ ను వివాహమాడిన జోలీ ఆ తర్వాత వారిద్దరికీ విడాకులు ఇచ్చి ప్రస్తుతం హాలీవుడ్ సెక్సీ హీరో బ్రాడ్ పిట్ తో కలసి సహజీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు కాగా మరో ముగ్గురిని దత్తతకు తీసుకున్నారు.
తాజాగా వీరిద్దరి సంసార జీవితం గురించి ప్రముఖ రచయిత లాన్ హాల్పెరిన్ రాసిన బ్రాంజెలీనా పుస్తకం ఎంత సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేది. ఏంజలీనా, బ్రాడ్ లు మరో 18 నెలల్లో విడిపోనున్నారని చెప్పి ప్రకంపనలు సృష్టించిన ఈ పుస్తకం ఇప్పుడు మరో సంచలన విషయాన్ని వెళ్లడించింది.
బ్రాడ్ ను కలవడానికి ముందు ఏంజలీనా జోలీ అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మరో సెక్సీ నటుడు జానీ డెప్ లతో సంబంధానికై ప్రయత్నించిందని రాసి ఓ చిన్న సైజు అణుబాంబునే వేసాడు హాల్పెరిన్. మరి బిల్ క్లింటన్ కు ఇలాంటివేమీ కొత్త కాదు. ఇంతకు ముందు మోనికా విషయంలో జరిగిన గొడవ గుర్తుండే వుంటుంది.


Click it and Unblock the Notifications











