మంచి డ్రస్సు సెన్సు ఉన్న ఏంజెలినా జోలి కూతురు..!
ఏంజెలినా జోలి మరియు బ్రాడ్ పిట్ ల ముద్దుల కూతురు షీల్హో. తన నాలుగు సంవత్సరాల మనమరాలు గురించి ఏంజిలీనా జోలి నాన్న మరియు హీరో జోన్ వోయిట్ చాలా గోప్పగా చెబుతున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో గాలా లో ఉన్న ఈ తాత గారు తన మనమరాలు గురించి చెప్పడానికి చాలా కబుర్లు ఉన్నాయంటున్నారు. షీల్హో చాలా తెలివైనదని, అంతేకాకుండా తన డ్రస్సింగ్ విషయాల్లో తన చిన్న తనం నుండే చాలా జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. తనకు ప్రస్తుతం నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటికి తను ప్రవర్తించేతీరు మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఇప్పటినుంచే తాను మాంటినిగ్రో స్టయిల్ ను అవలంబిస్తుందన్నారు. తనకు మేము చాలా మంచి మంచి డ్రస్సులను కోనిచ్చిన తను మాత్రం ట్రాక్ సూట్స్ వేసుకుంటుందన్నారు. ఇటీవల కాలంలో తనకు నచ్చిన దుస్తులను మాత్రమే వేసుకుంటుందని అన్నారు.
హాలీవుడ్ జోన్ వోయిట్ ఏంజెలినా జోలి బ్రాడ్ పిట్ షీల్హో hollywood jon voight angelina jolie brad pitt shiloh


Click it and Unblock the Notifications