twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగాళ్లతో ఆడుకుంటున్న టక్కుటిక్కులు నేర్చిన వగలాడి...!!

    By Kuladeep
    |

    హాలీవుడ్ ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ ఇటీవల 'ఐయామ్ సెలబ్రటీ' రియాలిటీ షోలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లి, తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో కలసి వుండటం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ కలసిపోనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ అవి కేవలం పుకార్లు మాత్రమేనని, రెయిడ్ తో ఇక పై కలసి వుండే ప్రసక్తే లేదని క్యాటీ ప్రకటించింది. ఆ తర్వాత తన మాజీ భర్త పీడర్ ఆండ్రీ ని తిరిగి తనని భార్యగా స్వీకరించాలని, క్షమాపనలు కూడా కోరింది. కానీ క్యాటీని తిరిగి తన భార్యగా అంగీకరించేందుకు పీటర్ నిరాకరించడంతో, ఇక తిరిగి క్యాటీ మనసు రెయిడ్ మీద పడింది. అంతే వెంటనే పీటర్ తో విడాకుల కన్నా రెయిడ్ ను వదలి ఉండటమే చాలా కష్టంగా, బాధగా వుందని ముసలి కన్నీరు కార్చుతూ తిరిగి రెయిడ్ కు గాలం వేసింది.

    ఇంకేం ఉంది ఆమె పిలిస్తే చాలు తన ముందు వాలిపోదామని సిద్ధంగా వున్న రెయిడ్ ఆమె కోరిక ప్రకారం రహస్యంగా ఆమెను కలుస్తున్నాడట. క్యాటీ మాయలో పూర్తిగా పడిపోయిన రెయిడ్ మాత్రం ఆమె తనతో ఆడుకుంటోందని తెలుసుకోలేక వారిద్దరి బంధం చాలా గట్టిదని, ఎప్పటికీ విడిపోదని తన స్నేహితులతో వాదిస్తున్నాడట. తన గురించి మీడియా మాట్లాడద్దు, అన్నా మాట్లాడినందుకే ఇంత హంగామా సృష్టించి, తన మాజీ భర్త తిరిగి తనని తీసుకోనందుకే గత్యంతరం లేక రెయిడ్ తో కలసిపోవాలని కపటనాటకాలు ఆడుతోందని అందరూ మాట్లాడుకుంటున్నారట. కొసమెరుపు ఏంటంటే రెయిడ్ తో రహస్య సంబంధాన్ని నడుపుతున్న క్యాటీ కొత్త బాయ్ ఫ్రెండ్ వేటలో పడిందట... ఈ సారి ఏ అమాయకుడు బలవుతాడోనని హాలీవుడ్ జనాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు....!!!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X