అలెక్స్ రెయిడ్ కు ప్రాణాపాయం??
ప్రముఖ మోడల్ జోర్డాన్ a.k.a. క్యాటీ ప్రైజ్ ప్రియుడు అలెక్స్ రెయిడ్ తనకు ప్రాణాపాయం ఉందని ఆందోళన చెందుతున్నారు. అతని క్రాస్ డ్రస్సింగ్ విషయం బయటకువచ్చాకా తన మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఏడాది సెపెంబరు నెలలో జరిగిన యుకే-1 ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన ఈ బాక్సర్ గురించి క్రాస్ డ్రస్సింగ్ వివాదానికి అతని ప్రియురాలు క్యాటీ ప్రైజ్ తెరలేపిన విషయం తెలిసిందే. అంతే కాదు ఆయన అమ్మాయి వేషధారణలో వున్నప్పుడు ఎన్నో ఫోటోలు కూడా వచ్చాయి. దీంతో అతని మీద దురభిమానం పెంచుకున్న ఆయన అభిమానులు ఆయన పై దాడి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారట.
ఇటీవలే జరిగిన ఓ పోటీలో పాల్గొన్న అతని పై చాలా మంది పిడిగుద్దులు కురిపించారట. దాంతో అతను భయాందోళనలకు లోనయ్యానని చెప్పుకొచ్చాడు. కొంత మంది అయితే డ్రస్సింగ్ రూములోకి జొరబడటానికి ప్రయత్నించారని చెప్పాడు. ఇలా అయితే ఇక పై పోటీలలో పాల్గొనాలంటే భయపడాల్సివస్తుందని, కానీ ప్రస్తుతానికి తాను అవేవీ పట్టించుకొనే స్థితిలో లేనని రాబోయే పోటీలో విజేతగా నిలవడమే తన లక్ష్యమని అందుకోసం ఎంతో కసరత్తులు చేస్తున్నానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు.


Click it and Unblock the Notifications











