అతను క్యాటీ బాయ్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండా? ప్రముఖ బాక్సర్ రెయిడ్ పైత్యం

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ బాయ్ ఫ్రెండ్ ప్రముఖ బాక్సర్ (cage fighter) అలెక్స్ రెయిడ్ తాను "ట్రై సెక్సువల్" అని ఓ ప్రకటన విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇంతకీ అందుకు దారి తీసిన పరిస్థితులేంటి అంటే ఆయన గారి గర్ల్ ఫెండ్ క్యాటీ ప్రైజ్. ఇటీవలే ఆయన గారు అమ్మాయి వేషధారణతో రొక్సేన్ అనే పేరుతో చెలామణీ అయ్యారట ఎవ్వరికీ తెలియకుండా. కానీ అలెక్స్ రెయిడ్ గర్ల్ ఫ్రెండ్ క్యాటీ ప్రైజ్ ఆయన అమ్మాయి వేషంలో ఉన్నప్పటి ఫోటోలను తీసి ప్రముఖ టీవీ జడ్జ్ సిమాన్ కోవెల్ 50వ పుట్టిన రోజు పార్టీలో అక్కడికి వచ్చిన అథితులకు చూపించిందట. దీంతో ఈయన గారి గురించి తలా ఒక్కోమాట అనుకున్నారట.

దీనిపై వివరణ ఇచ్చిన అలెక్స్ రెయిడ్ తాను ట్రై సెక్సువల్ అని ఏదైనా ఓ సారి ప్రయత్నించడంలో తప్పులేదని, అయినా తన జీవితం తన ఇష్టం అని క్యాటీ ప్రైజ్ పై కోపంతో ఊగిపోయాడట. కానీ అలెక్స్ శ్రేయోభిలాషులు మాత్రం ఈ ప్రకటనతో ఆయన కెరీర్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారట. పనిలో పని ఆయన గారి మరో మాజీ ప్రేయసి డానిల్లే సిమ్స్ కూడా ఆయన్ని అమ్మాయి వేషంలో చాలా సార్లు చూశానని, కానీ మొదట సారి అలా చూసినప్పుడు ఖంగుతిన్నానని చెప్పింది. అయినా చక్కగా వుండక ఇదేం పైత్యం అనుకుంటున్నారా???? ఇవన్నీ హాలీవుడ్ లో సర్వసాధారణమే మరి!!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X