నీకేంటి నువ్వు మగాడివి..!!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ ఆమెను చాలా మిస్ అవుతున్నడట. న్యూ మ్యాగ్జయిన్ తో మాట్లాడిన రెయిడ్ ఈ విధంగా తన విరహ వేధనను వ్యక్తపరిచాడు. క్యాటీ 'ఐయామ్ ఎ సెలబ్రిటి... గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లడంతో ఆమెను బాగా మిస్ అవుతున్నానని ఆయన చెప్పాడు. తను పరిచయమయ్యాకా, ఆమెను వదలి రెండు రోజులకు మించి వుండలేదని, అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు వదలి వుండటం చాలా కష్టంగా వుందని ఆయన చెప్పారు.
కానీ అతనిది ఆమెను వదలి వుండటానికి పడే బాధకాదని, ఎక్కడ ఆమె తనని వదిలేసి ఇంకొకరితో వెళ్లిపోతుందోనని భయపడుతున్నాడని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఆమె ఇంతకుమునుపు 'ఐయామ్ ఎ సెలబ్రిటి... గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే ఈ రియాలిటీ షోతోనే మాజీ బాయ్ ఫ్రెండ్ స్కాట్ ను వదిలేసి పీటర్ ఆండ్రీకి దగ్గరయి ఆయన్ను వివాహం చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి రెయిడ్ కు చేరువయింది. ఇప్పుడు తిరిగి అదే షోలో పాల్గొనడానికి వెళ్లడంతో ఆమె ఎక్కడ ఇంకొకరికి దగ్గరయి తనని వదిలేస్తుందోనని రెయిడ్ దిగులుచెందుతున్నాడట. కానీ అతని సన్నిహితులు మాత్రం నీకేంటి ఈమె కాకపోతే ఇంకొకరు అంతే కానీ అనవసరంగా బాధపడకు అని హితబోధ చేస్తున్నారట. అంతే కదా మరీ...ఏమంటారు.........!!


Click it and Unblock the Notifications











