అంతా భ్రాంతి ఏనా..జీవితానా వెలుగింతేనా....!!
అనుకున్నదంతా అయింది. హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ ఎక్కడ తనని వదిలేస్తుందోనని భయపడిన రెయిడ్ ఊహలను నిజం చేస్తూ, ఆమె అతనకి గుడ్ బై చెప్పేసింది. 'ఐయామ్ సెలబ్రిటి..గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు రెయిడ్ మీడియాతో మాట్లాడుతూ తను క్యాటీని చాలా మిస్ అవుతున్నానని, ఆమెను వదిలి వుండలేకపోతున్నానని విరహవేదనతో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త విన్న హాలీవుడ్ జనం మాత్రం అది అతని విరహ వేదన కాదని ఎక్కడ ఆమె అతన్ని వదిలేస్తుందోనని భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పుకున్నారు. దీనికి తోడు ఆమె ఈ రియాలిటీ షోలో తనకు సరైన జంట దొరికితే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా వున్నానని కానీ ఇంతవరకూ దొరకలేదని చెప్పడంతో ఆమె రెయిడ్ ను వదిలేయనుందనే వార్తలకు బలం చేకూరింది.
కానీ ఇంకా ఆమె ఏమీ చెప్పలేదని ధైర్యంగా వున్న రెయిడ్ నెత్తిన పిడుగు పడ్డట్టు అనిపించేలా, క్యాటీ తను ఇకపై రెయిడ్ కలసి వుండలేనని ఈ రియాలిటీ షో నుండీ బయటకు రాగానే ప్రకటించింది. దీంతో ఆమెతోనే నా జీవితం అని ఎన్నో కలలు కన్న రెయిడ్ ఇప్పుడు తెలుగు వస్తే "అంతా భ్రాంతి ఏనా జీవితానా వెలుగింతేనా..." అంటూ పాటందుకొనే వాడు....


Click it and Unblock the Notifications











