»   » నాకు కావలసింది డబ్బు ఎవరేమనుకుంటే నాకేంటి..??

నాకు కావలసింది డబ్బు ఎవరేమనుకుంటే నాకేంటి..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ ప్రియుడు అలెక్స్ రెయిడ్ లండన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బిగ్ బ్రదర్స్ రియాలిటీ షోలో విజేతగా నిలిచాడు. ఈ షోలో రెయిడ్ మొత్తంగా 65% ఓట్లు పొంది ప్రథమ స్థానంలో నిలిచాడు. సింగర్ డేన్ బోవెర్స్ రెండవ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఫుటో బాల్ ప్లేయర్ హార్డ్ మెన్, హాలీవుడ్ నటుడు విన్నీ జోన్స్ నిలిచారు. ఈ షోలో విజేతగా ప్రకటించాకా రెయిడ్ మాట్లాడుతూ తాను క్యాటీ ప్రైజ్ ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను వదిలించుకుంటాడు అనే వదంతులకు చెక్ పెట్టాడు.

కాగా ఈ రియాలిటీ షోలో తనగురించి మాట్లాడకూడదనే నిబంధనను అతిక్రమించినందుకు రెయిడ్ ను వదిలేస్తానని తన సన్నిహితులతో చెప్పిన క్యాటీ, రెయిడ్ విజేతగా నిలవడంతో తన ఆలోచనను మార్చుకుందని, త్వరలోనే అతడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. కానీ డబ్బుకోసం ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ డబ్బువున్నంత వరకూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న క్యాటీ రెండు మిలియన్ యూరోల వివాహ ఒప్పందానికి సిద్ధం అవుతోంది. అంతే మరి ఎవరో ఏదో అన్నారని ఇంటికొస్తున్న లక్ష్మీదేవిని ఎవరు కాదంటారు చెప్పండి...!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu