'ఫైథాన్' ల నుండీ బయటపడ్డ స్టార్ మోడల్

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ ఎంతో ఆశక్తితో 'అయమ్ సెలబ్రిటీ గెట్ మీ అవట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షోలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు కూడా ఈమె ఈ రియాలిటీ షో పాల్గొని అధిక మొత్తంలో నజరానా పొందిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి ఈ షోలో ఆమెకు అనుకోని విధంగా పెను సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో ఆమె ఈ షో నుండీ బయటకు వచ్చేయాలని నిర్ణయించుకొందట. ఈ షో నిబంధనల ప్రకారం వీక్షకులు కోరిన విధంగా సెలబ్రిటీలు అడవిలో సాహసాలు చెయ్యాల్సివుంటుంది. కాగా ఈ మోడల్ కు ఈ సారి పెను సవాలే ఎదురైంది. పైథాన్ పాములు వున్న పెట్టెలో ఈమెను వెళ్లాల్సిందిగా వీక్షకులు కోరడంతో ఖంగుతిన్న క్యాటీ తనా సాహసం చెయ్యలేనని షో నుండీ నిష్క్రమిస్తున్నానని ప్రకటించింది.

ఈ షోలో ఇప్పటికే ఈమె ఈగల ఫ్రై, పురుగుల బర్గర్ లాంటివి తిని సాహసం చేసిందనే చెప్పాలి. కానీ ఈ భయానక సాహసానికి ఒడిగట్టలేకే ఈ షో నుండీ నిష్క్రమిస్తున్నట్టు ఆమె తెలిపారు. వీక్షకులు ఇచ్చిన ఈ సాహసాన్ని బట్టి చూస్తే వారు నన్ను చాలా అసహ్యించుకుంటున్నట్టు అర్థమవుతోందని ఆవెదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X