తల్లడిల్లుతున్న క్యాటీ ప్రైజ్
హాలీవుడ్ మోడల్, పాప్ సింగర్ క్యాటీ ప్రైజ్ తన ఏడేళ్ల కొడుకు హార్వే అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లడిల్లిపోతేంది. నిన్నటి నుండీ అనారోగ్యంతో బాధపడుతున్న హార్వే కు స్వైన్ ఫ్లూ అని డాక్టర్లు అనుమానిస్తున్నారు. దీంతో క్యాటీ ప్రైజ్ కలవరపడుతోందట. ఇంత బాధలోనూ ఆమె ఈ విషయమై హార్వే తండ్రి, ఆమె మాజీ భర్త పీటర్ ఆండ్రీకి ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వలేదట. కానీ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పీటర్ ఆండ్రీ హార్వే చికిత్స పొందుతున్న రెడ్ హిల్ లోని ఈస్ట్ సుర్రే ఆస్పత్రికి హుటీహుటిన చేరుకొని హార్వేను పరామర్శించాడట.
కానీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని డాక్టర్లు తేల్చిచెప్పారట. స్వైన్ ఫ్లూ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మరో 48 గంటలు పర్యవేక్షించాక కానీ ఏమీ చెప్పలేమని అన్నట్టు తెలిసింది. దీంతో జోర్డాన్ తన కార్యక్రమాలను రద్దు చేసుకోనుందట, తన కోసం ఎదురుచూస్తున్న తన అభిమానులకు ఆమె క్షమాపనలు చెప్పారు.


Click it and Unblock the Notifications











