భర్త కన్నా ప్రియుడిని వదిలుండటం కష్టం... !!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లి 'ఐయామ్ సెలబ్రిటీ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్' అనే రియాలిటీ షో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లి తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో ఇక పై కలసివుండబోనని చెప్పి రెయిడ్ గుండెల్లో అగ్ని రేపిన సంగతి తెలిసిందే. అటుపై యుకె తిరిగి వచ్చిన ఈమె రెయిడ్ ను మధ్యాహ్నం భోజనానికి ఆహ్వానించడంతో ఆమె రెయిడ్ మాటలకు పడిపోయి తిరిగి అతనితో కలసి సహజీవనం సాగించనుందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనుందనే వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలసి తమ పెళ్లికి ఉంగరాన్ని కూడా కొన్నట్టు వార్తలు వచ్చాయి.
కానీ ఈ విషయం పై స్పందించిన క్యాటీ ఈ వార్తలన్నీ ఒట్టి గాలి కబుర్లే అని కొట్టిపారేసింది. రెయిడ్ తిరిగి కలసిపోయే ప్రసక్తే లేదని తేల్చిపారేసింది. తన భర్త పీటర్ ఆండ్రీకి విడాకులు ఇచ్చి విడిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదని, రెయిడ్ నుండీ విడిపోయినందుకు తనెంత బాధపడుతోందో చెప్పుకొచ్చింది. మరంత బాధపడటం ఎందుకు తిరిగి కలసిపోవచ్చుగా అంటే "రెయిడ్ మీద నా ప్రాణాలన్నీ పెట్టుకున్నా, తను మాత్రం నన్ను, నా అభిమతాన్ని గౌరవించలేదని అలాంటి వారితో కలసి వుండలేనని" చెప్పింది. కాగా తన కొడుకుని, క్యాటీ మోసం చేసిందని రెయిడ్ తల్లి క్యాటీపై దుమ్మెత్తిపోస్తోంది. అయినా ఇవేవీ పట్టని క్యాటీ కొత్త బాయ్ ఫ్రెండు ని వెతికే పనిలో మునిగిపోయిందట....!!


Click it and Unblock the Notifications











